వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు హీరో విజువల్ ఎఫెక్ట్సే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Visual Effects
చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్స్ చూపించటంలో బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలకన్నా టాలీవుడ్ వాళ్లే ముందున్నారంట. హాలీవుడ్ తలపించే విజువల్ ఎఫెక్ట్స్ తో మనవాళ్లు ప్రేక్షకులనే కాదు హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలను సైతం ఆకట్టుకుంటున్నారు. గతంలో చిత్రాలలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించాలంటే విదేశాలకు వెళ్లవలసి వచ్చేది. దీంతో భారీగా ఖర్చు అయ్యేది నిర్మాతలకు. అందుకు అప్పట్లో నిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్ కన్నా సెట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని పరికరాలు మన దేశంలోనే అందుబాటులో ఉండటంతో నిర్మాతలు సెట్టింగులను మరిచి విజువల్ ఎఫెక్ట్స్ పై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతున్నాయంట. విజువల్స్ ఎఫెక్ట్స్ తో హీరోల పాత్ర తగ్గిపోతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. హీరోల పెర్ఫామెన్స్ పై కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడడమే మంచిదనే ఓ అభిప్రాయం కూడా తెలుగు దర్సకుల్లో నెలకొన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఖర్చు మాట అటుంచితే దర్శకుడి మదిలో మెదిలో విజువల్ భారీ సెట్టింగ్సు కన్నా విజువల్ ఎఫెక్ట్స్ ద్వారానే రావటం కూడా మరో ముఖ్య కారణం. చిత్రాల్లో గ్రాఫిక్సు అంతకుముందు ఉపయోగించినప్పటికీ దేవి చిత్రంతో పరిశ్రమ దృష్టి పడింది. ఇటీవల వస్తున్న చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించని చిత్రాలు వేళ్లమీదే లెక్కించవచ్చు. అనుష్క ప్రముఖ కథానాయికగా వచ్చిన అరుంధతి, రాంచరణ్ తేజ కథానాయకుడిగా వచ్చిన మగధీర చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఎంతగా అలరించాయో తెలిసిందే.

శతదినోత్సవం దిశగా పరుగెడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం రోబో పూర్తి కంప్యూటరైజ్డ్ చిత్రం. ఇది అందరినీ ఎంతగానో అకట్టకున్నది. అయితే వీటిలో ఎఫెక్ట్స్ స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సునీల్ కథానాయకుడిగా పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఇటీవల విడుదలైన మర్యాద రామన్న చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఎవరూ గుర్తు పట్టలేరు. అందులోని కొన్ని సన్నివేశాలలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించారు. ఆరెంజ్ చిత్రం కూడా విజువల్స్ తో ప్రేక్షకులను అలరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X