వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరక్షణ్: భావప్రకటనా స్వేచ్ఛ, దళిత హక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Aarakshan
"హమ్ ప్రతిభా మే విశ్వాస్ రఖ్‌తే హైఁ, ఆరక్షణ్ పర్ నహీ" (ప్రతిభపై మేం విశ్వాసం ఉంచుతాం, రిజర్వేషన్లపై కాదు) - ఆరక్షణ్ సినిమాలోని శక్తివంతమైన డైలాగ్ ఇది. దీన్నిబట్టి రిజర్వేషన్లు పొందుతున్న దళిత, మైనారిటీ, గిరిజన సామాజిక వర్గాలకు ఈ సినిమా వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం కలుగుతోంది. దీంతోనే బహుశా, సినిమా చుట్టూ వివాదం చుట్టిముట్టి ఉంటుంది. దళితులకు ఈ సినిమా వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం బలంగా నాటుకుని పోయింది. పర్యవసానంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి.

అమితాబ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, దీపిక ఈ సినిమాలో నటించారు. గొడవ మొదలు కావడంతో అమితాబ్, సైఫ్ అలీఖాన్ ఇళ్ల ముందు భద్రతను పెంచారు. శతాబ్దాల తరబడి వివక్షకు, అణచివేతకు, అభివృద్ధికి దూరమైన దళిత వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తేవడానికి రిజర్వేషన్లు ఉపకరిస్తాయని బాబా సాహెబ్ అంబేడ్కర్ బలంగా విశ్వసించారు. దాంతో రిజర్వేషన్ల అమలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నది. నిజమే, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఇప్పటికీ తీరికపోవడం ఓ విషాదం. రిజర్వేషన్ల ఫలితాలు పొందని దళిత వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అది రాజకీయాస్త్రంగా కూడా మారింది. ఇప్పటికీ అభివృద్ధికి ఆవలి తీరంలోనే ఉన్న దళితులకు రిజర్వేషన్ల ప్రయోజనం అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఈ దిశగా ఆలోచన జరగాల్సిన అవసరం ఉంది.

ఇటీవలి కాలంలో అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ తరం యువకులకు రిజర్వేషన్ల గురించి పెద్దగా తెలియడం లేదు కూడా. తనకు రిజర్వేషన్ల గురించి తెలియదని నటి దీపికా పడుకొనే అనడం ఈ సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. అది తెలిసి వచ్చేసరికి తాము ఎంత చదివినా తమకన్నా తక్కువ మార్కులు వచ్చినవారు తమకన్నా మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారనే అభిప్రాయం విద్యావ్యవస్థలో బలపడుతోంది. ఇది అగ్రవర్ణాల పిల్లలకు, దళిత పిల్లలకు మధ్య ఓ గోడను నిర్మిస్తోంది. అగ్రవర్ణాల పిల్లలను రిజర్వేషన్ల విషయంలో చైతన్యవంతులను చేసే ప్రక్రియ గానీ అవసరం ఉన్నవారికి రిజర్వేషన్ల ఫలితాలు అందేలా చూడడంలో గానీ పాలకవర్గాలు విఫలమయ్యాయనే చెప్పాలి. బహుశా, ఈ నేపథ్యంలో ప్రకాష్ ఝా ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు.

ఆ విషయం పక్కన పెడితే - సినిమాపై నిషేధం విధించడం భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదా అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును రాజ్యాంగం కల్పించింది. సినిమాపై నిషేధం ఆ స్వేచ్ఛకు భంగం కలిగించడమేననే అభిప్రాయం కూడా ముందుకు వచ్చింది. అయితే, సినిమాపై వివాదం సృష్టించడం పబ్లిసిటీ స్టంట్‌లో భాగమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయపరమైన సినిమాలను నిర్మించి వివాదాలు సృష్టించడం ప్రకాష్ ఝాకు అలవాటు అని కూడా అంటున్నారు.

English summary
With the ban on Aarakshan film, the question of freedom of expression is coming fore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X