వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలీని కూడా టీవిల్లోకి

By Srikanya
|
Google Oneindia TeluguNews

Ali
వెండితెరపై రిటైరేతే ఆ తర్వాత ప్రస్దానం బుల్లి తెరమీదే అనేది ఓ ఉద్యమంలా అన్ని భాషల్లోనూ సాగుతోంది.రాధిక వంటి వారు సీరియల్స్ నిర్మిస్తూ,నటిస్తూ ముందుకు వెళ్థూంటే మరికొందరు రియాలటీ షోలు,గేమ్ షో లతో టీవిల్లో తమను తాము బిజి చేసుకుంటున్నారు.అమితాబ్ చేసిన కౌన్ బనేగా కరోడిపతి పోగ్రాం క్లిక్ అవటంతో సినిమావారి అందరి దృష్టి టీవీపై పడింది. తాజాగా ఆ లిస్టులోకి అలీ కూడా చేరుతున్నారు.

తెలుగులో స్టార్ కమిడియన్ గా వెలిగి,ఆ తర్వాత హీరో కూడా అయిన అలి ఇప్పుడు కాస్త చల్లబడ్డారు.దాంతో తన కెరీర్ మరో వైపు మరలించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ టీవిలో ఓ గేమ్ షో చేయటానికి ఆయన కమిటయ్యారు.సెలబ్రెటి గేమ్ షో టైటిల్ తో సాగ్ ఈ షో ఆగస్టు చివరి వారం నుంచి మొదలుకానుంది.ఇక ఇప్పటికే చాలామంది ఆర్టిస్టులు బుల్లి తెరమీదకు వచ్చేసిన నేపధ్యంలో అలీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక సాయికుమార్ చేస్తున్న వావ్ పోగ్రాం,రాజీవ్ కనకాల చేస్తున్న అభిమాని పోగ్రాం ఇప్పటికే ఛానెల్స్ లో మంచి రేటింగ్స్ తో ముందుకు వెళ్థున్నాయి.ఇక సాక్షి ఛానెల్ లో ధర్మవరపు సుబ్రమణ్యం చేస్తున్న డింగ్ డాంగ్ పోగ్రాం కూడా మంచి పాపులారిటనే సంపాదించుకోంది.అయితే ఇక్కడా కొద్దిమంది ఫెయిల్యూర్ అయిన వారు ఉన్నారు.ఐ న్యూస్ లో అలాగే ఆ మధ్యన బ్రహ్మానందం గేమ్ షో స్టార్ట్ చేసారు కానీ అది ఫెయిల్యూర్ అయింది.మరి ఇప్పుడు అలీ ఎంతవరకూ నెగ్గుకొస్తాడో చూడాలి.

English summary
Popular comedian Ali is all set to make his debut on TV. Sources say that he’s going to host a ‘Celebrity Game Show’ which will be aired on ETV. The show is expected to go live in the last week of August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X