వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనయుడికి కోచ్‌గా మారిన అజరుద్దీన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Azharuddin
రెండో కుమారుడు ఆయాజుద్దీన్ మరణించిన తర్వాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ మొదటిసారి సికింద్రాబాదులోని జిమ్కానా మైదానానికి శుక్రవారం వచ్చారు. తన పెద్ద కుమారుడు అసదుద్దీన్‌కు బ్యాటింగ్‌లో కొన్ని టిప్స్ నేర్పించారు. అజర్ సున్నితమైన సీమ్ బౌలింగ్ చేసి, ఔత్సాహిక బౌలర్లకు బంతిని ఎలా పట్టుకోవాలో నేర్పించారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ తన కుమారుడు అసదుద్దీన్ బ్యాటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించారు. తన కుమారుడు బంతిని ఎలా ఎదుర్కుంటున్నాడో చాలా జాగ్రత్తగా గమనించారు. ఎడమ చేతితో బంతిని ఎలా డ్రైవ్ చేయాలో, ఎలా తరలించాలో బ్యాట్ పట్టుకుని చూపించారు.

తన తనయుడి బ్యాటింగ్ గురించి మాజీ హైదరాబాద్ ఎడమ చేతివాటం ఓపెనర్, కోచ్ విజయ్ మోహన్ రాజ్‌తో మాట్లాడారు. హైదరాబాద్ ట్రోఫీ రంజీ కోచ్‌గా నియమితులైన సునీల్ జోషీతో ఆయన కొత్త బాధ్యతల గురించి, జట్టు అసైన్‌మెంట్ గురించి అజర్ మాట్లాడారు. జోషీ, ఫీల్డింగ్ కోచ్ ఆహ్వానం మేరకు ఆజర్ హైదరాబాద్ జట్టు సభ్యులను ఉద్దేశించి సంక్షిప్తంగా మాట్లాడారు. ఆజర్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారని, అది జట్టు సభ్యులకు ఎంతో ఉత్సాహన్నిచ్చిందని జోషీ అన్నారు.

English summary
Former Indian skipper Mohammad Azharuddin who was at the Gymkhana grounds in Secunderabad on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X