వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారువేషాల్లో తిరుగుతున్న భానుకిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ పోలీసుల కన్నుగప్పడానికి చిత్ర విచిత్ర అవతారాలు ఎత్తుతున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుకిరణ్‌ను దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు అన్నీ తిరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. పోలీసుల కన్నుగప్పడానికి ఆయన మారువేషాల్లో తిరుగుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు సంబంధించిన ఊహా చిత్రాలు సైతం పోలీసుల వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. లక్నో, గుర్గావ్, చంఢీఘర్, కాన్పూర్, ఢిల్లీ, ఝాన్సీ, పూణే, నాగపూర్, మధురై తదితర ప్రధాన పట్టణాలన్నీ భాను తిరిగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి మారు వేషాలు వేసుకుంటున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఓసారి విగ్గు పెట్టుకోవడం, మరోసారు గుండు గీసుకోవడం, సూట్ వేసుకోవడం, మీసాలు తీసేస్తూ.. ఒక్కో సమయంలో ఒక్కో మతానికి చెందిన వ్యక్తిగా గెటప్‌లు మార్చుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాను కిరణ్ ఆచూకీ కోసం పోలీసులు దేశంలోని తొమ్మిది ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం ఊహా చిత్రాలు గీసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఒక ఊహా చిత్రకారుడిని సైతం తన వెంటే ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు రోజుకో అవతారం ఎత్తి తమను బురిడీ కొట్టిస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిర్మాతలు శింగనమల రమేష్, సి. కళ్యాణ్ ఇచ్చిన సమాచారం మేరకు సైతం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Bhanu Kiran was still not found, who main accused in Maddelachervu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X