వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతకాల పిచ్చిలో బాలీవుడ్ స్టార్స్

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

Aishwary rai and Kareena Kapoor
ఇతర దేశాల్లో సంగతేమోగానీ.. సెంటిమెంటు వస్తువులు, జోతిష్యాలు, జాతకాలు, న్యూమరాలజీని నమ్మేవారు మన దేశంలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సీనీతారల్లో అందులోనూ బాలీవుడ్ స్టార్స్ లో ఈ పోకడ మరీ ఎక్కువ. అందుకే అమితాబ్ మొదలుకొని అనేక మంది బాలీవుడ్ స్టార్లు వీటిని ఫాలో అవుతూ ఉంటారు. సినిమా జయాపజయాలు, వ్యక్తిగతంగా సక్సెస్ కు ఇదే కారణమని విశ్వసిస్తుంటారు. సినిమా బిగినింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఏ నెంబరు కారు వాడాలి, ఎలాంటి రంగు డ్రెస్సలు వేసుకుంటే కలిసొస్తుంది, ఎలాంటి ఉంగరాలు పెట్టకుంటే మంచి జరుగుతుందనే దానిపై దృష్టి సారిస్తుంటారు.

బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ విషయానికొస్తే ఆయన చేతికి రకరకాల ఉంగరాలు కనిపిస్తుంటాయి. సినిమాల్లో అయినా, రియాల్టీ షోలయినా...తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వాటిని తీయడానికి అస్సలు ఇష్ట పడరు. బాలీవుడ్ షారుఖ్ ఖాన్ గతంలో తన కెరీర్ భారీ సక్సెస్ సాధించిన సినిమాల్లో ఉపయోగించిన డ్రెస్సులను ఇప్పటికీ దన దగ్గర పెట్టుకున్నారు. ఏదైనా సినిమా ప్రారంభించే ముందు వాటి ఒక్కసారైనా వేసుకుని తీరతాడట.

సంజయద్ తన సక్సెస్ కు ఎప్పటి నుంచో తాను ఉపయోగిస్తున్న గొడుగు కారణమని బలంగా నమ్ముతాడు. ఎక్కడికెళ్లినా దాన్ని తన వద్దే ఉంచుకుంటాడు. వినడానికి ఫన్నీగా ఉన్నా ఇది వాస్తవం. అబిషేక్ బచ్చన్ తను సెల్ ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటికీ ఒకే నెంబర్ ఉపయోగిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాత రాకేష్ రోషన్ తన సినిమాల్లో మొదటి అక్షరం' కె"తో ప్రారంభం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. హీరోయిన్లు ఐశ్వర్య, కరీనా, గాయని లతామంగేశ్వర్ లాంటి వాళ్లు లక్కీ స్టన్స్ తమకు లక్కును తెచ్చి పెడుతుంటాయని వాటిని తెగ కొనేస్తుంటారు. ఇక అఃదృష్టం కలిసి రావాలని పేర్లను మార్చుకునే హీయిన్లు కోకొల్లలు. ఎవరి నమ్మకాలు వారివి కానీ....ఈ జాతకాల పిచ్చి ముదిరితేనే ఇబ్బందులు తప్పవనే వాదన కూడా లేక పోలేదు.

English summary
Bollywood stars depend on predictions, like numerology, lucky stones ect..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X