• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చావును ముందుగానే పసిగట్టే ‘పిల్లి’

|

Can this cute Cat secretly sense Death?
'ఆస్కార్" ఇదేదో అవార్డు పేరు కాందడోయ్..! ఓ వింత శక్తిని సొంతం చేసుకున్న 'మార్జాలం" నామధేయం. ప్రస్తుతం దీని నివాసం రోడె ఐలాండ్స్ (న్యూ ఇంగ్లాండ్)లోని సెంట్రల్ స్టీర్ హౌస్ నర్సింగ్ అండ్ రిహేబిలిటేషన్ సెంటర్. డాక్టర్ డేవిడ్ డోసా 'జెరియాట్రీషియన్" ఆసుపత్రిలో పెరిగిన ఈ పెంపుడు పిల్లి ప్రత్యేక శక్తిని సంతరించుకుని ప్రపంచ వ్యాప్తంగా అందిరి నోట్లో నానుతోంది.

కొన్ని నెలల క్రితం ఓ వింత వార్త విని ప్రపంచం నివ్వెర పోయింది... పరిశోధకులు తత్తర పోయారు.. శాస్త్రవేత్తలు బిత్తరపోయారు... ఓ సాధారణ పిల్లి మరణాన్ని ముందుగా పసిగట్టటమా..? ఇదంతా ట్రాష్ అని పలువురు అంటే..!, శక్తులు కలిగిన మేధావులు లోకంలో ఎందరు లేరు..! వారిలాంటి ప్రత్యేకతే ఈ పిల్లికి ఉండి ఉంటుందని పలువరు ఈ అద్భుతాన్ని సపోర్టు చేశారు.

ఈ పిల్లి ఆరు నెలల వయసులో ఉన్నప్పుడే.. డాక్టర్ డేవిడ్ డోసా 'ఆస్కార్" లో విచిత్రమైన శక్తి దాగి ఉందని గుర్తించారు. ఆస్కార్ ఎవరి బెడ్ క్రిందికైనా వెళ్లి కామ్ గా పడుకుందటే పైనున్న వారికి 24 గంటల్లో కాలం చెల్లినట్లు లెక్కె.. మృత్యువు మరి కొన్ని గంటల్లో వారిని కబళిస్తున్నట్లే..

రిహేబిలిటేషన్ సెంటర్ లో ఎవరయితే మరో 24 గంటల్లో మరణిస్తారో.. ఖచ్చితంగా ఆ ఫేషంట్ బెడ్ క్రిందకు ఆస్కార్ చేరుతుంది. మొదటిలో ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు..? మాములు రోజుల్లో రిహేబిలిటేషన్ సెంటర్లో ఏదో మూలన సేద తీరే 'ఆస్కార్" ఆసుపత్రిలోని రోగి మృతిచెందబోతున్నాడంటే చాలు.. అతని బెడ్ క్రిందకు చేరి మౌనంగా పడుకుంటుంది. తోలినా.. అరిచాని.. ఆస్కార్ ఆ బెడ్ ను వీడే ప్రసక్తే లేదు. ఇలా పదిల కొద్ది సందర్భాలలో ఇదే సీన్ పునరావృతం కావటంతో రీహేబిలిటేషన్ వైద్య బృందం ఓ ఖచ్చితమైన నిర్థారణకు వచ్చింది.

ఈ అంశాన్ని మరింత నిర్థారణ చేసుకునే క్రమంలో భాగంగా వైద్యులు పలు ప్రయోగాలు కూడా చేశారు. ఏ బెడ్ క్రింద అయితే 'ఆస్కార్" పడుకుంటుందో .. ఆ బెడ్ పై ఉన్న పేషంట్ ను మరో బెడ్ మీదకు మార్చి చూశారు. పేషంట్ ను మర్చబడిన బెడ్ వద్దకు వెతుక్కుని మరి వెళ్లి 'ఆస్కార్" వాళ్ల బెడ్ క్రింద నిద్రపోయేదట.

అలా కాదని వైద్య బృందం ఓ సారి.. ఆ పిల్లి ఎవరి బెడ్ క్రింద అయితే పడుకుందో వారిని బుతికించటానకి సర్వ శక్తులు ఒడ్డి ప్రయత్నించారు.. కాని ఫలితం మాత్రం శూన్యం. ఇలా వారు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. మరోసారి .. ఓ పేషంట్ మరికొద్ది సమయంలో చనిపోతాడాని నిర్థారణకు వచ్చిన వైద్య బృందం రోగి బెడ్ కిందకు 'ఆస్కార్" వస్తుందిని ఎదరుచూశారు..కానీ ఇక్కడా వారు మోసపోయారు..విచిత్రంగా 'ఆస్కార్"

అస్త్మాతో భాదపడుతూ కోలుకుంటున్న మరో రోగి బెడ్ క్రిందకు వెళ్లి పడుకుంది.

ఈ సారి 'ఆస్కార్" పప్పులో కాలేసిందని అందరూ ఊహించారు.. ఇక్కడ అద్భుతమేమిటంటే.. వైద్యులంతా ఏ పేషంట్ అయితే చనిపోతాడుకున్నారో ఆ రోగి నిశ్చింతంగా కోలకున్నారు. అయితే అస్త్మా నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉన్న మరో పేషంట్ మాత్రం నిద్రలో కన్నుమూశారు.

ఇలా వందల సందర్భాల్లో వైద్యులు సందేహాలను నివృత్తి చేసిన ఈ మార్జాలం ప్రపంచ మేధావులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. గదిలో ఒక వేళ రోగి మరణించే స్థితిలో ఉంటే.. ఆస్కార్ ను రానీయకుండా వైద్యులు తలుపులు వేశేసే వారు.. అయిన పట్టువదలని 'వింత మార్జాలం" తలుపులు ఎప్పుడు తీస్తారానని మూసివున్న తలుపుల దగ్గరే వేచి ఉండేది.

అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇదే రిహేబిలిటేషన్ సెంటర్లో మరో ఐదు పిల్లులు ఉన్నాయి. వాటిలో ఏ పిల్లికి ఈ వింత లక్షణాలు లేవని ఆసుపత్రి సబ్బంది చెబుతున్నారు. పరిశోధకులు.. మేధావులు ఈ పిల్లి ప్రవర్తనను విశ్లేషించారు. మూర్ఛను ముందుగా గుర్తించే శునకాలు.. కేన్సర్ ను ముందుగా గుర్తించే ప్రత్యేక శునకాలు ఎలా అయితే రోగి శరీరం నుంచి వెలువడే కొన్ని వాసనలను గుర్తించి ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించగలుగుతున్నాయో.. అదే విధంగా మరణించే ముందు మనిషిలో సంభవించే కెమికల్ మార్పులు కారణంగా వారి శరీరం నుంచి వెలువడే ఏదో వాసనను ఈ పిల్లి గ్రహించి వారి మరణాన్ని ముందుగానే సూచించగలుగుతుందని వీరోక అభిప్రాయానికి వచ్చారు.

ఈ అభిప్రాయంలోనూ స్పష్టతను వెలికితీసేందుకు.. మరికొద్ది గంటల్లో మరణించే రోగి శరీరం నుంచి ఏలాంటి వాసనలు వెలువడతాయి అన్న కోణంలో ప్రత్యేక పరిశోధనలను కూడా వీరు ఆరంభించారు. ఆ వాసనలను పరిశోధకులు గుర్తించ గలుగుతే.. అదే వాసనల్ని గుర్తించి వెంటనే స్పందించే సెన్సార్లను రూపొందించగలిగితే.. కొన్ని గంటల ముందే రాబోయే మృత్యువును గుర్తించ వచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం.

English summary
Nicknamed the "cat of death", this ordinary-looking tabby has extraordinary abilities and doctors believe he has predicted the passing of more than 50 patients. When Oscar sits beside a resident at the nursing home in Rhode Island, New England, doctors know they must act. The patient's family is called to say goodbye and sometimes a priest gives the last rites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X