వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైర్ వర్క్స్.....మిస్ ఫైర్ కాకుండా జాగ్రత్త పడండి!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Diwali - Festival of Crackers
వెలుగులు విరజిమ్మే దీపావళి పండుగలో పిల్లలకైనా, పెద్దవారికైనా ఆనందాన్నిచ్చేవి టపాకాయలే! ఫైర్ వర్క్స్ లేని దీపావళి పండుగను ఊహించగలరా? ఆ పని ఎవరూ చేయలేరు. దీపావళి నాడు టపాకాయలు ఎంత ప్రాముఖ్యమో, పండుగ ఆనందం కోల్పోరాదంటే అవి కాల్చేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంత ప్రధానమైనవి. కనుక దిగువ మేము అందించే కొన్ని ముందు జాగ్రత్తలు ఆచరించండి.

సురక్షిత ప్రదేశం - టపాసులను వేడి తగలని ప్రదేశంలో సురక్షితంగా వుంచండి. వీటిని గట్టి మూత గల బాక్సు లో పిల్లలకు, పెంపుడు జంతువులకు అందని చోట భద్రంగా వుంచాలి.

కాటన్ బట్టలను ధరించండి - టపాసులను కాల్చేటపుడు వదులు లేని బిగువైన కాటన్ దుస్తులను ధరించండి. అవి తేలికగా అంటుకోకుండా వుంటాయి. పొడవైన లేదా లూజైన దుస్తులు సురక్షితం కాదు.

ఒక్కటి ఒకసారి - ఒక్కొక్క టపాసును ఒకసారిగానే వెలిగించండి. అన్నీ ఒకేసారి వెలిగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం వుంది.

పిల్లలను దూరంగా వుంచండి - టపాసులు కాల్చేటపుడు పిల్లలను దూరంగా వుంచండి. పిల్లలు కాల్చేటపుడు పెద్దలలో ఒకరు వారిపక్కన వుండటం మంచిది.

చెవులు జాగ్రత్త - టపాసుల ధ్వని 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ కనుక వాటి ధ్వని మీ లోపలి చెవికి హాని కలిగించవచ్చు. ప్రతి 15 నిమిషాలకు కొంత విశ్రాంతినివ్వండి. చెవులలో కాటన్ దూదులు పెట్టుకుంటే మంచిది. పసిపిల్లలను ధ్వనుల నుండి దూరంగా వుంచండి.

అవసరపడితే, ధ్వనిని నియంత్రించే పరికరాలను చెవులకు వాడండి. లేదా ఒక పొడవాటి మఫ్లర్ ను చెవులపైగా తలకు చుట్టండి.

ఏం చేయాలి ? ఏం చేయరాదు ?

చేయాల్సినవి -
-టపాసులు లైసెన్సు పొందిన అధీకృత డీలర్ వద్ద మాత్రమే కొనుగోలు చేయండి.
-వాటిని గట్టి మూత వున్న బాక్సులో పెట్టండి.
-వేడికి దూరంగా, పిల్లకు అందుబాటులో లేకుండా ఉంచండి.
-వాటిని ఒకరే నిర్వహించకుండా, ఇద్దరు లేదా ముగ్గురు కలసి జాగ్రత్తలు తీసుకోండి.
-టపాసులు వెలిగించేటపుడు పొడవైన కేండిల్ లేదా కాకరపువ్వత్తి వంటివి ఉపయోగించండి. మ్యాచెస్ వాడరాదు.
-మీకు - వెలిగించే టపాసుకు మధ్య దూరాన్ని పెట్టండి
-టపాసులు కాల్చే సమయంలో ఎల్లపుడూ ఒక బకెట్ నీళ్ళు వుంచితే, ఏదైనా జరిగినపుడు వాటిని ఉపయోగించవచ్చు.

కాలితే ఏం చేయాలి?
-ఏదైనా కాలటం, కోసుకోవటం జరిగితే, ఆ భాగంపై మంట తగ్గేంత వరకు నీటిని చల్లండి. చేతివేళ్ళు లేదా కాలివేళ్ళు కాలితే, వాటికి బ్యాండేజి కట్టి బాధితుడిని ఆస్పత్రికి తీసుకు వెళ్ళండి. బాధితుడు శ్వాస సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా వెంటనే గమనించండి. అవసరపడితే శ్వాస కోశంలోకి గాలి ఊదండి. కాలిన శరీర భాగానికి బ్యాండేజి వేయండి. కాల్పులపై టవల్ లేదా దుప్పటి కప్పకండి. సరైన వైద్యం కొరకు తక్షణమే బాధితుడిని హాస్పిటల్ కు తరలించండి.

చేయకూడనివి -

-టపాసులు చేతితో పట్టుకొని కాల్చకండి
-గుంపులున్న చోట, ఇరుకైన ప్రదేశాలలో టపాసులు కాల్చవద్దు.
-టపాసులు ఇంటిలో కాల్చవద్దు
-పెద్దవారు పక్కన లేకుండా పిల్లలు ఒకరే టపాసులు కాల్చటానికి అనుమతినివ్వద్దు
-ధ్వని పెద్దగా రావాలని టపాసులను సీసాలలో లేదా డబ్బాలలో పెట్టి కాల్చరాదు.
-టపాసులు వెలిగించిన తర్వాత అది కాలిందా లేదా అని వెళ్ళి పరీక్షించవద్దు. కొత్తది కాల్చండి.

ఆనందకరమైన, సురక్షితమైన దీపావళి కోరుతూ.......!

English summary
Fireworks are the important things in joyful Diwali or Deepavali. No one can imagine a Diwali without crackers. As crackers are important on Diwali, the safety measures are also important to make the festival safest and happiest. There is a list of Do’s and Don’ts which make your Diwali sparkling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X