వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు సెంచురీ కొట్టాలని ఉందా..

|
Google Oneindia TeluguNews

Tips
చీకు.. చింతాలేని జీవితానన్ని బతికినంత కాలం ఆస్వాదించాలనుకుంటారు మానవులు.. ప్రస్తుత యాంత్రిక యుగంలో అది సాధ్యమవుతుందా..? సాధ్యమనే అంటున్నారు పలువురు నిపుణులు.
మంచి అలవాట్లు.. జాగ్రత్తలు నూరేళ్ల జీవితాన్ని ప్రసాదిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.

నిరాశా వాదులతో పోలిస్తే ఆశావాదులు 12 సంవత్సరాలు అధికంగా బతుకుతారట. నిరాశావాదులు ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ వహిస్తారట. అందుకే వారు త్వరగా రోగాల భారిన పడతారట.. సో మీరు ఆశావాదులో..? నిరాశావాదులో..? తేల్చుకోండి. ఆరోగ్యానికి చేటు కలిగించే వ్యసనాలకు దూరంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం మన చెంతే ఉంటుదట.

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయటం, అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం జీవ ప్రక్రియకు మంచిది కాదు. సాధారణంగా అర్థరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలో కణాల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. రాత్రి 8 గంటల లోపు భోజనం చేసి 10 గంటల కల్లా నిద్రపోయే వారికి కణాల పునరుత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా యూత్ దృష్టిలో ఉంచుకోవాలి.

మీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా..? ఆరోగ్యకరమైన దంతాలు ఉన్నావారు ఆరు సంవత్సరాలు ఆయుష్షు అదనంగా పొందుతారట.. ఇది వైద్యుల మాట. కడుపుబ్బా నవ్వటం వ్యాయమంతో సమానమంటున్నారు సైకాలజిస్టులు. మనసునూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుందట. అంతే కాదు మన చిరునవ్వు మన భావాన్ని చెబుతుందట.

ఇక దంపతులు వారానికి రెండు సార్లైనా రతి చర్యలో పాల్గొంటే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అంతే కాదండోయ్..! శృంగారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే వారికి వయస్సు పై బడుతున్న 7 సంవత్సరాలు తక్కువుగా అనిపిస్తుందట. అంటే చూడండి సెక్స్ చేస్తే ఎంత ఉత్సాహం వస్తుందో.

English summary

 The number of such factors that may figure in to your health and longevity is infinite, but you can significantly reduce your risk of a number of life-threatening illnesses and increase your life span to atleast a 100 years by following these tips by doctors
 
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X