వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌పై అజరుద్దీన్‌కు కోపమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mohammad Azharuddin
క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంటులో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచిన భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్‌కో కోపమే ఉన్నట్లుంది. ఆయన ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే ఆ అభిప్రాయం కలుగుతుంది. టెండూల్కర్‌పై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. కొంత మంది గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఆయన అన్నారు. తాను సచిన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని, కొంత మంది గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఆయన అన్నారు. కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ ఫలితం సాధించకపోవడంపై కూడా ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు.

ఆజర్, సచిన్ టెండూల్కర్ కలిసి చాలా మ్యాచులు ఆడారు. సచిన్ కెప్టెన్సీలో అజరుద్దీన్, అజరుద్దీన్ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్ ఆడారు. కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ ఎందుకు విజయం సాధించలేదని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అతని గురించి తాను మాట్లాడదలుచుకోలేదని, కొంత మంది ఉంటారు - వారి గురించి మాట్లాడకపోవడమే మంచిది అని అన్నారు. సచిన్ కెప్టెన్సీలో మీరు సహకారం అందించలేదని అనుకోవచ్చా అని అడిగితే అది నిజం కాదని, గణాంకాలు చూసుకోవచ్చునని, వేరే వాళ్ల కెప్టెన్సీలో కన్నా సచిన్ కెప్టెన్సీలో తాను ఎక్కువ పరుగులు చేశానని అజర్ వివరించారు. కెప్టెన్‌గా విజయం సాధించే లక్షణాలు సచిన్‌కు లేవని అన్నారు.

మీ పాత సహచరులు సచిన్ టెండూల్కర్, ద్రావిడ్ ఆడుతుంటే చూడాలనిపిస్తుందా అని అడిగితే లేదని చెప్పారు. వివియస్ లక్ష్మణ్ ఆడుతుంటే చూడాలనిపిస్తుందని, లక్ష్మణ్ పాజిటివ్ క్రీడాకారుడని ఆయన ప్రశ్నించారు. తన పాత సహచరులు ఎవరితోనూ తాను సంబంధాలు కొనసాగించడం లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తనది విభిన్నమైన జీవితమని, అల్లా తనకు ఆ సహనాన్ని ప్రసాదించాడని, తాను సహనం గల వ్యక్తినని, సహనం జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణపై 2000లో అజర్‌పై జీవితకాలం పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించారు. మరి కొన్నేళ్లు తాను ఆడి ఉండేవాడినని ఆయన చెప్పారు. తాను బాగా ఆడుతున్నానని, తాను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని, ఫిట్నెస్ టెస్టులో కొంత మంది యువకుల కన్నా తాను ఎక్కువ దార్ఢ్యంతో ఉన్నట్లు తేలిందని, చివరి టెస్టు మ్యాచులో వంద పరుగులు చేశానని ఆయన వివరించారు. అదృష్టం అంతే ఉందని, తాను 99 టెస్టు మ్యాచులు మాత్రమే ఆడాలని రాసి పెట్టి ఉందని ఆయన అన్నారు. తన మేనమామ వల్లనే తాను క్రికెట్‌లోకి వచ్చానని, అతను తనకు ఎంతో మేలు చేశారని ఆయన అన్నారు.

మణికట్టు మాయాజాలం చేసే క్రికెటర్‌గా అజర్‌కు పేరుంది. ప్రపంచ క్రికెట్‌లో అజర్ ఈ తరహా శైలికి విస్తృత ప్రచారం, పేరు ఉంది. దాని గురించి తనకు క్లూ ఏమీ లేదని, ఆ విధంగా కూడా బ్యాటింగ్ చేయవచ్చునని ఆలోచన వచ్చిందని, తాను తన సహజమైన ఆటనే ఆడానని ఆయన అన్నారు. వ్యక్తిగత జీవితంపై మాట్లాడడానికి అజర్ నిరాకరించారు. సంగీతా బిజలానీ, మీరు కలిసే ఉంటున్నారా అని అడిగితే సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇరువురి మధ్య సంబంధం ఏర్పడడానికి కారణమేమిటని అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు.

English summary
Mohammad Azharuddin used to be as soft with his words as he was with his sublime strokes. But in a recent interview to a magazine, the former Indian cricket captain had something trenchant to say on some issues. Most surprisingly, he made some caustic remarks about, of all people, Sachin Tendulkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X