వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్యావరణ మార్పులు జంతువుల ఆహారం కారణంగానే!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Food and Warming? A lot of Meat in it....
ఆహారం కొరకు చేయబడుతున్న వ్యవసాయం పర్యావరణాన్ని అధికంగా మార్చి వేస్తోంది. వాతావరణంపై తక్షణ ప్రభావాన్ని చూపుతోంది. వాతావరణ మార్పు, నేలలో సారం పోవటం, భౌగోళిక ఉష్ణోగ్రతల పెంపు, గ్రీన్ హౌస్ వాయువులు అన్నీ కూడా వ్యవసాయం కారణంగానే ! అన్నిటికంటే ఆశ్చర్య పరచేదేమిటంటే, ప్రపంచంలోని సగం పైగా పంటలు జంతువుల ఆహార అవసరాలు తీర్చటానికే కాని మననుషుల కొరకు కాదట. ఒక్క కిలోగ్రాం బీఫ్ మాంసం తయారు కావాలంటే, రైతులు ఒక ఆవుకు 15 కెజిల గింజల దాణా లేదా 30 కెజిల గడ్డి దాణా వేయాల్సి వుంటుంది.

ఇక ఈ జంతువులు తినే ఆహార ధాన్యాలు కావాలంటే ఎరువులు వేయాల్సిందే. వీటిని ఉత్పత్తి చేయాలంటే ఇంధనం కావాల్సిందే. ఒక కిలో మాంసం ధర, ఒక కిలో ధాన్యం లేదా ఒక కిలో బంగాళ దుంప కంటే అధికమే. ఈ భావన వినియోగదారుని వైపు నుండే కాదు పర్యావరణం వైపునుండి కూడా అధికంగానే పరిగణించబడుతోంది. జనాభా పెరిగే కొలది మాంసం కొరకు, వాటి ఇతర ఉత్పత్తుల కొరకు జంతువులను పెంచటం కూడా అదికమైపోతోంది. ఇదే మాదిరిగా కొనసాగితే, కోట్లాది డాలర్లు కార్బన్ లెవెల్స్ ను సురక్షిత స్దాయిలో ఉంచటానికే వ్యయం చేయబడాల్సి వస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇక చవక అయిన ప్రత్యామ్నాయంగా, ప్రపంచ జనాభాను వారి ఆహార అవసరాలకు తక్కువ మాంసాహారం వైపుకు మళ్ళించి జంతువులను తగ్గించాలి. దీనితో వ్యవసాయ భూమి అధికంగా వుండిపోయి ఈ భూమిపై పెరిగే పచ్చదనం కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను కూడా తగ్గిస్తుంది. జంతువుల మాంసానికి ప్రత్యామ్నాయంగా వుండే రీసెర్చి ప్రాజెక్టులపై నెదర్లాండ్ ప్రభుత్వం అధిక నిధులను ఖర్చు చేస్తోందట. జంతువుల మాంసం కంటే కూడా కీటకాల మాంసంలో అధిక ప్రొటీన్లు వుంటాయని చెపుతూ ఆ దేశ శాస్త్రజ్ఞులు కీటకాలపై తీవ్ర పరిశోధనలు చేస్తున్నారు. కీటకాల మాంసం ఆరోగ్యకరమైనదని, పర్యావరణ స్నేహపూరితమైనదని కూడా చెపుతున్నారు. జంతు తెగలలో 80 శాతం కీటకాలేనని వాటిలో 1,000 రకాల వరకు తినదగిన జాతులేనని కూడా గుర్తించారు.

ఆహారం కొరకు కీటకాలను పెంచితే, జంతువులతో మానవులకు వుండే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కీటకాలకు జంతువుల వలే అధిక ఆహారమివ్వవలసిన అవసరం కూడా లేదు. వీటికి నీటి అవసరం కూడా చాలా తక్కువ. జంతువుల వలే ఎక్కువ ప్రదేశాలను కూడా ఆక్రమించవు.

ఇక కీటకాల మాంసం రుచి ఎలా వుంటుందంటే గట్టి కాయల వలెనే వుంటుంది. వీటిని పోషక విలువలకు గాను ఇతర ఆహారాలలో కలుపుకొని తినాలి. మాస్ట్రిచెట్ యూనివర్శిటీ సైంటిస్టులు ఈ సమస్యలన్నీ పరిష్కరించటానికి వివిధ రకాలుగా కృషి చేస్తున్నారు. డచ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. జంతువుల మాంసం కానటువంటి మరో రకమైన విట్రో మాంసాన్ని ఈ దేశపు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అయితే ఈ మంసం ఇంకా ప్రజల వినియోగానికి అందుబాటులో లేదు. ఈ శాస్త్రవేత్తల పరిశోధనలు విజయవంతమైతే, ఇకపై మనం జంతువులపై మాంసం కొరకు ఆధార పడాల్సిన పని లేదు. జంతువుల కవసరమైన టన్నుల కొద్ది ఆహారాన్ని కూడా వ్యవసాయ భూములపై పండిచాల్సిన అవసరం లేదు.

English summary
A cheaper alternative is in getting the global population to shift to a low meat diet and thereby reduce livestock population. This would not only free up considerable farm land, the vegetation growing on this land would additionally mop up carbon dioxide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X