• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫారిన్ పాపల జోరు-దేశీ భామల బేజారు

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

మన దేశపు సినీ తారలు విదేశీ గడ్డపై రాణించడం ఏమోగానీ..? భారతీయ గడ్డపై మాత్రం పలువురు విదేశీ హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. క్రతినా, జాక్వలైన్ ఫెర్నాండెజ్, బార్బరామోరీ, గిసెల్లీ, నదీషా తదిరులు భారతీయ సినిమాల్లో ఓ ఊపు వూపుతున్నవారు. భారత దేశంలో ఇంత మంది కథానాయికలు ఉండగా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అని అడిగితే దకొత్తనం అనే మంత్రాన్ని వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. మన సినిమాల్లో విదేశీ భామల జోరు ఇప్పు మొదలైంది కాదు. 70వ దశకంలోనే మొదలయింది. అప్పట్లో వచ్చిన 'మేరానామ్ జోకర్" సినిమా ద్వారా తొలి విదేశీ భామ తెలుగు సినిమాపై మెరిసింది. ఇందులో కినియా అనే రష్యన్ భామతో రాజ్ కపూర్ సాంగేసుకున్నాడు.

వీళ్ల జోరు అంతంత మాత్రమే అనుకుంటే పొరపాటే. కరీనా, ప్రియాంక చోప్రా..లాంటి హేమాహేమీలున్న బాలీవుడ్ లో విదేశీ భామాలు గెలిచి నిలుస్తున్నారు. కైట్స్ సినిమాలో హృతిక్ సరనన నటించిన అమ్మాయి బార్బరా మోరీ. ఆ సినిమా సరైన విజయం సాధించలేక పోయినా ఆ అమ్మాయి గ్లామర్ బాలీవుడ్ జనాల్ని ఆకట్టుకుంది. రోషన్ తో ఎఫైర్ నడుపుతుందనే పుకార్లు ఆమెకు మరింత క్రేజ్ ను తెచ్చి పెట్టాయి. ఇక లవ్ ఆజ్ కల్ చిత్రంలో ఆకట్టుకున్న మరో భామ గిసెల్లీ. బ్రెజిల్ దేశస్తురాలు. వాస్తవానికి ఈ చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ ఆ పాత్ర కోసం బెంగాలీ అమ్మాయి కోసం వెతికారు. కానీ ఆయనకు కావాల్సిన లక్షణాలు ఎవరిలోనూ కనిపించ లేదు. చివరకు గిసెల్లి ఆ ప్లేసు దక్కించుకుంది. ఇంతటితో ఊరుకోకుండా 'ఆల్వేస్ కబీ కబీ" చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. ఇక్కడ అవకాశాలు బాగానే ఉండటంతో ఏకంగా ఇక్కడికే మకాం మార్చింది.

మన పొరుగు దేశం శ్రీలంకకు చెందిన భామ జాక్వలైన్ ఫెర్నాండెజ్ 'అల్దాదీన్" సినిమాతో భారతీయ సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ లో అవరుస అవకాశాలు దక్కించుకుంటోంది. అదే విధంగా పాక్ భామ నర్గీస్ ఫక్రి, తదితరులు కూడా రాణిస్తున్నారు. జెన్నీఫర్ లోఫేజ్ సోదరి క్యాట్రీనా లోఫేజ్ కూడా ఇప్పడు బాలీవుడ్ లో రాణిస్తోంది. బిండీ బజార్ అనే హిందీ సినిమాలో ఓ సాంగులో నటించింది.

ఇక మన తెలుగు సినిమాల్లోనూ ఈ పోకడ తక్కువేమీ కాదు. తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాన్ సరసన రొమాన్స్ చేసిన అమ్మాయి పేరు జేన్ స్టాండింగ్. ఆస్ట్రేలియా భామ. పార్వతి మెల్టన్ అమెరికా నుంచి వచ్చింది. మిస్టర్ రాస్కెల్ చిత్రంలో కథానాయిక స్థానం దక్కించుకున్న అమ్మాయి నదీషా హేమా మాలిని. శ్రీలంక సుందరి. ఆర్య2 చిత్రంలో రింగరింగ పాటకు నర్తించిన భామ ఎరీనా, 100%లవ్ సినిమాలో డియాలో..పాటకు చిందులేసిన సుందరి రియమ్ జకారియాలు విదేశాల నుంచి దిగుమతి అయినవారే.

అలా అని విదేశాల నుంచి వచ్చిన భామలంతా ఇక్కడ విజయం సాధిస్తున్నారని చెప్పలేం. కత్రినా లాంటి వారికి లక్కు కలిసొచ్చి నెంబర్ వన్ స్థానంలో ఉంటే....చాలా మంది ఒకట్రెండు సినిమాల్లో మెరిసి తెరమరుగై పోతున్నారు. అయితే రోజుకో కొత్త భామ విదేశాల నుంచి దిగుతుండటంతో తమకు అవకాశాలు దర్కడం లేదని బేజారుపడే హీరోయిన్లు లేక పోలేదు.

English summary
While foreign star doing well in Bollywood, Indian stars are almost all failing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X