వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదంలో హెల్త్ విలేజ్, గాలిపై మరో పిడుగు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలులో మగ్గుతున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై మరో పిడుగు పడింది. ఆయన హెల్త్ విలేజ్ వివాదంలో చిక్కుకుంది. హైదరాబాదు శివారులోని 140 ఎకరాల భూమిని హెల్త్ విలేజ్ అభివృద్ధికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చారు. అవి శిఖం భూములనే ఆరోపణలు ముందుకు వచ్చాయి. చెరువుల శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. రంగారెడ్డి జిల్లాలోని దుబ్బచెర్ల గ్రామంలో సహజ నీటి వనరుకు చెందిన 10 ఎకరాల భూమిని గాలి జనార్దన్ రెడ్డి కబ్జా చేసి ఫెన్సింగ్ వేశాడనే ఆరోపణలు వచ్చాయి.

గాలి జనార్దన్ రెడ్డి 2006లో కొంత భూమి కొనుగోలు చేసి, 2007లో డెవలప్‌మెంట్ కోసం శ్రీ వెన్సాయి రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఆ సంస్థ 790 ప్లాట్లను సిద్ధం చేసి 226 ప్లాట్లను ఇప్పటికే అమ్మినట్లు వార్తలు వచ్చాయి. పది ఎకరాలను కూడా దాంట్లో కలుపుకుని గాలి జనార్దన్ రెడ్డి ఫెన్సింగ్ వేయడంతో ఆ ప్రాజెక్టుపై వివాదం చెలరేగుతోంది. ఆ స్థలాన్ని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు శుక్రవారం సందర్శించారు.

గాలి జనార్దన్ రెడ్డి భూకబ్జాపై హనుమంతరావు రెవెన్యూ అధికారులను తప్పు పట్టారు. గాలి నుంచి లంచాలు తీసుకుని శిఖం భూమిలో ప్లాట్లు చేయడానికి అనుమతించారని ఆయన ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలను రియల్టర్స్ ఖండిస్తున్నారు. ఆ పది ఎకరాల్లో తాము ఏ విధమైన ప్లాట్లు చేయలేదని, మిగతా 130 ఎకరాల్లో తగిన అనుమతులు తీసుకుని మాత్రమే ప్లాట్లు చేశామని చెబుతున్నారు.

English summary
Mining baron Gali Janardhan Reddy has landed in a fresh trouble by handing over 140 acres owned by him on the city outskirts to a real estate firm to develop a ‘Health Village.’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X