వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడలింగ్ రంగంలో పెరుగుతున్న ‘గే’ కల్చర్

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

Gay Culture
ఒకప్పడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ' గే " (స్వలింగ సంపర్కం) కల్చర్ ఇప్పడు మన దేశంలోనూ క్రమక్రమంగా వేళ్లూను కుటోంది. స్వలింగ సంపర్కులను ఈ‌సడించుకునే భారత సమాజం మారిన పరిస్థితుల నేపథ్యంలో....మెల్లమెల్లగా అనుకూలత ప్రదర్శించే వైపుగా అడుగులు వేస్తోంది. కోర్టులు కూడా స్వలింగ సంపర్కం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోకడలు సామాన్య ప్రజానీకం కంటే ఉన్నత వర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.

ముఖ్యంగా మోడలింగ్, ఫ్యాషన్ రంగం, ఫ్యాషన్ మీడియా రంగాల్లో పని చేసే వారిలోనే స్వలింగ సంపర్క పోకడలు ఎక్కువగా ఉన్నాయి. వారిలో ఎక్కువగా మగ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ను అందంగా తీర్చి దిద్దే మగాళ్లే కావడం విశేషం. ఎక్కువ సమయం ఆడవారితో గడపడం వల్లనో? ఏమో కానీ వారు కూడా ఆడవారి లఃక్షణాలను సంతరించుకుని మగ-మగ సంపర్కానికి మొగ్గచూతున్నారు. బాలీవుడ్ లో వచ్చిన దోస్తానా, ఫ్యాషన్ సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లను పరిశీలిస్తే..ఆ రంగంలో 'గే" కల్చర్ ఏ విధంగా ఉందో అవగతం చేసుకోవచ్చు.

అంతెందుకు....మన రాష్రం నుంచి మోడలింగ్ రంగంలో రాణిస్తూ దేశం తరుపున మిస్ యూనివర్శ్ పోటీల్లో పాల్గొనే చాన్స్ దక్కించుకున్న 'వాసుకి సుంకవల్లి" కూడా ఈ రంగంలో 'గే " కల్చర్ ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తోంది. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్య్రకమంలో వాసుకి మాట్లాడుతూ.....'మోడలింగ్ రంగంలో ఉండే మగాళ్లు ఎక్కవగా 'ఆ టైపే" ఉంటారు, కాబట్టి ఆ రంగంలో ఉండే ఆడవాళ్లపై సెక్స్ వేధింపులు పెద్దగా ఉండవు" అని తెలిపింది. మోడలింగ్ రంగంలో ఉన్న వాసుకి ఇలా చెప్పిందటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో లెస్సిబియన్ సెక్స్ (ఆడ-ఆడ) పోకడలు కూడా ఈ రంగంలోనే ఎక్కువ. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ గే, లెస్బియన్లకు అండగా నిలుస్తూ పోరాటాలు కూడా చేస్తోంది.

చాలా మంది సామాన్య ప్రజలు ఈ స్వలింగ సంపర్క పోకడలను వ్యతిరేకిస్తుంటే..... గే, లెస్పియన్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు.
భూమి మీద జనాభా నియంత్రణ అరికట్టడానికి దేవుడు మాకు ఇచ్చిన వరం అంటూ సమర్థించుకుంటున్నారు. మేము ఎవరికీ కీడు చేయడం లేదు, మా వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులులేవు, మా ఇష్ట ప్రకారం మేము ఉంటున్నాము, అది మా హక్కు అంటూ వాదిస్తున్నారు.

English summary
Now a day in India Gay Culture is farming in high speed. Modeling, fashion field people attracting this way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X