• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆత్మాహతి దాడుల చరిత్ర ఈనాటిది కాదు

By Pratap
|

Suicide Bomb Attacks
ప్రాణాలను ఫణంగా పెట్టే ఆ ఆశయం కోసం అన్నింటిని వదులుకోవాలి. శత్రువును తుదిముట్టిచటమే కాదు తన చావుకు సిద్ధపడి ఉండాలి. రక్తపాతాన్ని సృష్టిం‌చే త్యాగానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఆత్మాహుతికి పాల్పడే వారి లక్ష్యాలు ఇవే... దాడులతో ఏమి సాధించారన్న విషయాన్ని పక్కన పెడితే.. నమ్మిన సిద్ధాంతం కోసం వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నారు.

అసులు ఈ దాడుల నేపథ్యం ఏమిటీ..? ఎవరు సృష్టించారు..? ఎప్పుడు మొదలయ్యాయి..? ఆత్మాహుతి యుద్ధనీతిలో ఓ భాగం కాదు.. శత్రువల మధ్యకు వెళ్లడం తనను తాను పేల్చుకుని ఎదుటి వారిని చంపటం అంటే ఒకరి ప్రాణాన్ని ఫణంగా పెట్టి పలువురి ప్రాణాలు తీయడం. ఈ దాడి మొదటిసారిగా 1661లో జరిగిందని చరిత్రకారులు తేల్చారు. డచ్ వారి పై తైవాన్ రాజు యూయాంఘై ఆత్మాహుతి దాడి చేయించాడు. తన సైన్యంలో తీవ్రంగా గాయపడిన వారికి మందుగుండు పదార్థాలు చుట్టి శత్రువుల పై దాడి చేయించేవాడు. ఆ తరువాత 1864లో పర్షియన్ సైనికులు పెట్రోల్ క్యాన్‌లను పట్టుకుని శత్రువుల పడవల్లోకి దూకి నిప్పంటించుకునేవారు.

విధ్వంసకర మారణాయుధాలు వెలుగులోకి రావటంతో ఆత్మాహుతి దాడులు అతి భయంకరంగా మారటంతో వందలాది మంది వీటికి ఆహుతయ్యారు. 1943లో హిట్లర్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే ఆ దాడి నుంచి హిట్లర్ తృటిలో తప్పించుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఫ్రెంచ్ సైనికుల పై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ప్రభాకరన్ నేతృత్వంలోనే తమిళ టైగర్లు లంక ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెట్టాక ఆత్మాహుతి దాడుల సంఖ్య పెరిగింది. క్రమంగా ఆత్మాహుతి దాడులంటే ఏమిటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. తమిళ టైగర్లు చేసిన ఆత్మాహుతి దాడిలో లంక అధ్యక్షడు ప్రేమదాసతో పాటు పలువురు నేతలు అసువులు బాశారు.

తమిళ టైగర్లను అనుసరిస్తూ ఇస్లామిక్ తీవ్రవాదులు, అల్ ఖైదా సంస్థలు ఈ దాడులను పెంచి పోషించాయి. ఆత్మాహుతి బాంబులతో ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రపంచంలో పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. ఈ దాడులు ఎక్కువగా పాలస్తీనా, ఇజ్రాయిల్, రష్యా ప్రాంతాల్లో జరిగాయి. వీరితో పాటు హమాస్, కుర్దిష్, చెచెన్యా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పూనుకున్నారు. రష్యన్ల పై కసి పెంచుకున్న చెచన్యా తీవ్రవాదులు సినిమా హాళ్లతో పాటు ఆసుపత్రులలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడులకు హమాస్ తీవ్రవాదులు అధికంగా మహిళలను ఉపయోగించేవారు.

2000 - 05 మధ్య జరిగిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 600 మంది మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా. దాడుల్లో పెద్దదిగా అభివర్ణించే 2001 సెప్టంబర్ 11 ఆమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన వైమానిక దాడిలో దాదాపు 3వేల మంది అసువులుబాశారు. ఆత్మాహుతి దాడుల వణుకు మన దేశానికి తగిలింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో యావత్ దేశం ఉలిక్కిపడింది. శ్రీలంకలో శాంతి కోసం భారత సైన్యాన్ని పంపిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పై ఎల్టీటీఈ కక్ష పెంచుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెరంబదూర్ వచ్చిన ఆయనను మహిళా టైగర్ థాను బెల్ట్ బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడి రాజీవ్ తో పాటు పలువురిని బలిగొంది.

ఆ తరువాత అంతగా భారత్‌లో ఆత్మాహుతి దాడులు జరగలేదు. అయితే మొన్నటి ముంబై బాంబు పేళుళ్లలో ఆత్మాహుతి దాడి ఉండవచ్చని అనుమానించిన ప్రభుత్వం ధర్యాప్తు తరువాత కాదని తేల్చింది. అయితే మన దేశంలో పాక్ ప్రేరిపత ఉగ్రవాదులు విధ్వంసాలు సృష్టిస్తునే ఉన్నారు. ఈ దాడుల్లో అత్యధికంగా నష్టపోయింది ముంబయ్ వాసులే.. సమస్య పరిష్కారానికి హింసే మార్గమనుకుంటే అది మూర్కత్వమే అవుతుంది. నమ్మిన సిద్ధాంతం కోసం మీరు చేస్తున్న మారణహోమం అమాయకుల ప్రాణాలను బలిగొనటం తప్ప.. ఆశయాలను నెరవేర్చటం లేదన్న విషయాన్ని గ్రహించాలి.

English summary
Terrorist suicide attacks have not proved to be the war winning weapon that they were first thought to be, but they are no doubt a very effective terror weapon and incredibly difficult to stop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X