వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కందిరీగ’ తెలంగాణపై విషం?

By Srikanya
|
Google Oneindia TeluguNews

Kandireega
రామ్, హన్సిక ల కాంబినేషన్ లో రూపొంది సూపర్ హిట్టైన కందిరీగ చిత్రం ఇప్పుడు మరో సారి హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం తెలంగాణపై విషం చిమ్మిందంటూ కొన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.వారి వాదన ఏమిటంటే...ఆంధ్రాలోని అనకాపల్లికి చెందిన హీరో ట్రైన్ లో చేసిన ఫైట్ చూసి తెలంగాణాలోని వరంగల్లుకి చెందిన అమ్మాయి పడిపోవటం.చూస్తే ఆ హీరో ఏమో డిగ్రీ కూడా పూర్తికాని అల్లరి వాడు,మరదలిచేత తిరస్కరింపబడిన వాడు.అలాంటి వాడు తెలంగాణా యాసలో మాట్లాడే ఈవ్ టీజర్స్ బారి నుండి అమ్మాయిల్ని రక్షించి, ఆ రౌడీలకు 'అమ్మాయిల్ని అల్లరి చెయ్యాలి కాని, అల్లరిపాలు చెయ్యకూడదు" అని గీతోపదేశం చేసి తెలంగాణా అమ్మాయి(అక్ష)ని పడేయటం.

ఇక మరో అభియోగం ఏమిటంటే...సినిమా మొట్ట మొదటి సీన్ నుంచే ఆ తెలంగాణా అమ్మాయిని ఒక తెలివితక్కువదానిలా చూపించటం.అంతేగాక హీరో గారు కూడా 'తింగరబుచ్చి", 'ఇంత వయోలెంట్ గా ఎలా పుట్టావే " అని అంటూ ఉంటాడు.ఆ తర్వాత ఆమెను వెర్రి దానిగా,ఎడ్డిదానిగా చిత్రీకరించటం.మరో సారి ఈ తెలంగాణా అమ్మాయి సంస్కారం లేని దానిలా తన కాబోయే మామ గారికి అంటే హీరో తండ్రికి నమస్కారం చేయమంటే..' చల్… గా పొట్టి సాలెగాడు… గానికి నేను మొక్కుడేంది? నేన్మొక్కా.." అంటుంది.అదే మరో హీరోయిన్ హన్సిక చక్కగా గౌరవంగా తన మామకి నమస్కారం చేయటం చూపిస్తాడు దర్సకుడు. ఇవన్నీ ఇలా ఉంటే నెగిటివ్ పాత్ర చేసిన జయప్రకాష్ రెడ్డి కూడా తెలంగాణా వాడిగా చూపెట్టడాన్ని తప్పుపడుతున్నారు.ఇలా వెతుక్కుంటూ పోతే పాటలో మరో చోట తెలంగాణా తెప్పించేస్తా అనటం కూడా పద్దతి కాదు అంటున్నారు.

ఏది ఏమైనా తెలంగాణా ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి సున్నితమైన అంశాలు పట్ట సినిమా వారు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.ఎందుకంటే ఏ ప్రాంతంకి చెందిన వారి మనోభావాలైనా వారి స్ధాయిలో గొప్పవే.వాటిని తెలిసి చేసినా,కామిడి కోసం చేసినా దెబ్బ తింటే ఎదుర్కోవటం ఇబ్బందికరమే.

English summary
Kandireega opposite to Telangana?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X