వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ ఖర్చు మూడేళ్లలో రూ. 16 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajmal Amir Kasab
ముంబై దాడులు జరిగి ఈ నెల 26వ తేదీ వస్తే సరిగ్గా మూడేళ్లు. మూడేళ్ల క్రితం నవంబర్ 26వ తేదీన ముంబైపై ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదుల్లో మొహ్మద్ అజ్మల్ కసబ్ మాత్రమే భారత్‌కు పట్టుబడ్డాడు. ఇప్పటి వరకు అతని కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రస్తుతం కసబ్ ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. కసబ్ తిండికి, వైద్య అవసరాలకు, మందులకు, భద్రతా కల్పనకు ప్రభుత్వం ఇప్పటి వరకు 16 కోట్లు ఖర్చు చేసింది. కోర్టుల్లో కేసుపై పోరాడడానికి చేసిన ఖర్చు ఇందులోకి రానే లేదు.

కసబ్ కేసును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఇప్పటి వరకు న్యాయపోరాటం కోసం 12 లక్షల రూపాయలు ఖర్చయినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖంకు 90 రోజులకు గాను ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు వాదనల కోసం ఉజ్వల్ నిఖం ఫీజు పెరిగింది. రోజుకు ఆయన పీజు 50 వేల రూపాయలు. ఆయన బిజినెస్ క్లాస్‌లో పని చేస్తున్నారు. ముంబై - ఢిల్లీ రిటర్న్ ట్రిప్‌ ఖర్చు రూ. 70వేలు ఉంటుంది. ప్రభుత్వ అతిథి గృహంలో విఐపి స్యూట్ కేటాయించాల్సి ఉంటుంది.

కసబ్ హై రిస్క్ ప్రిజనర్ కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భద్రతకు పెట్టే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అతని తిండికి రోజుకు 27 రూపాయలు అవుతుంది. ఈ ఏడాది జులై వరకు భద్రతకు ప్రభుత్వం 10.87 కోట్లు చెల్చించాల్సి ఉంది. నవంబర్ 26వ తేదీ వరకు ఈ ఖర్చు 14 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. ఏమైనా, కసబ్ మీద ప్రభుత్వం విరివిగానే డబ్బులు ఖర్చు చేస్తుందని భావించాలి, తప్పదు కదా.

English summary
Maharashtra’s taxpayers have so far coughed up more than Rs 16 crore to maintain the country’s most high-profile prisoner, Ajmal Kasab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X