వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాలతో మొదలు, అంతం ఎక్కడ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Ravi-Maddelacheruvu Suri
తెలుగుదేశం పార్టీకి చెందిన పరిటాల రవితో మొదలైన హత్యల పరంపర ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉన్నది. ఎవరు ఎవరిని మట్టుబెట్టారో, ఎవరు ఎందుకు హత్యకు గురవుతున్నారో తెలియని పరిస్థితి. ప్రతీ హత్యా ఓ సంచలనమే. ఈ సంచలనంలో వాస్తవాలు మరుగున పడుతున్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. పరిటాల రవిని తానే హత్య చేశానని ఓ టీవీ చానెల్ ముందు చాతీ విరుచుకుని చెప్పిన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను అనూహ్యంగా హైదరాబాదు పరిసరాల్లోని ఓ లాడ్జీలో గాయపడి పోలీసులకు చిక్కాడు. అది మొదలు పరిటాల రవి హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రతి ఒక్కరూ హత్యకు గురవుతున్నారు.

మొద్దు శీను జైల్లోనే హత్యకు గురయ్యాడు. మొద్దు శీనును తానే హత్య చేశానని ఓం ప్రకాష్ అనే వ్యక్తి అంగీకరించాడు. పరిటాల రవిని చంపిన తర్వాత బావ సూరి కళ్లలో ఆనందం చూశానని మొద్దు శీను చెప్పుకున్నాడు. అయితే, ఆ తర్వాత మొద్దు శీనుకు, మద్దెలచెర్వు సూరికి మధ్య విభేదాలు పొడసూపినట్లు ప్రచారం జరిగింది. ఈ స్థితిలో మొద్దు శీను హత్య జరిగింది. సూరే ఈ పని చేయించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. పరిటాల రవి హత్య కేసులోనే కాకుండా మొద్దు శీను హత్యతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని సూరి చెబుతూ వచ్చాడు. అదే వరుసలో సాంబశివరావు అనే వైద్యుడు శవం దిక్కూ మొక్కూ లేకుండా నడికుడి వద్ద రైల్వే ట్రాక్‌పై పడి ఉంది. ఈ వైద్యుడి చర్లపల్లి జైల్లో సూరికి సెల్‌ఫోన్లు అందజేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతని పని అయిపోయినట్లు చెబుతారు. అండర్ వరల్డ్ డాన్‌తో సంబంధాలున్న అజీజ్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులో పోలీసు కాల్పుల్లో మరణించాడు.

చోటా షీకీల్‌తో సంబంధాలున్న అజీజ్ రెడ్డి మొత్తం వ్యవహారంలో ఆయుధాలు సరఫరా చేసినట్లు అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. పరిటాల రవి హత్య వ్యవహారంలో ఏదో మేరకు అజీజ్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే అజీజ్ రెడ్డి పోలీసు కాల్పుల్లో మరణించాడని చెబుతారు. తాజాగా, మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలోనే అంతమయ్యాడు. పరిటాల రవి హత్యోదంతంతో మొదలైన సీరియల్ కిల్లింగ్స్ సూరి దాకా నడిచింది. వరుసలో తర్వాత ఎవరుంటారనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న భాను కిరణ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. భాను కిరణ్ ఏమయ్యాడనే ప్రశ్న మీడియానే కాదు, అందరినీ తొలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X