వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరిని అలరించే నవరాత్రి పండుగ!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Navratri
భారతీయుల పండుగలలో నవరాత్రి ఒక ప్రధానమైన పండుగ. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో వచ్చే ఈ పండుగ తొమ్మిది రోజులలో పూర్తిగా దుర్గా మాతను పూజిస్తారు. పండుగ తొమ్మిది రోజులపాటు దుర్గా మాతకు తొమ్మిది అలంకారాలతో ఆచరిస్తారు. తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు జరిగే ఈ పండుగలో, పూజలు, ఉపవాసాలు, జపతపాలు, మంత్రాలు, శ్లోకాలు, ధ్యానాలు, భజనలు అన్నింటిలోను దుర్గా మాతకు ప్రాధాన్యతనిస్తారు.

మాత ఆశీస్సులకై భక్తులు మాతకు టెంకాయలు, పండ్లు, పూవులు పుష్కలంగా సమర్పిస్తారు. ఈ పండుగను ఇండ్లలోను, దేవాలయాలలోను కూడా జరుపుతారు. కొత్త బట్టలు ధరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దాండియా(కోలాటం), డప్పు వాయిద్యాలు, రకరకాల వేషాలతో మాతకు ఊరేగింపులు చేస్తారు.

నవ రాత్రులలో చివరి మూడు రోజులు ప్రధానమైన పండుగలుగా పరిగణించబడతాయి. వీటిని దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిలుగా చెపుతారు. పండుగ దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఆచరిస్తారు. అయితే అందరికి ఈ పండుగలో ప్రధాన పూజా దేవత దుర్గా మాత. తొమ్మిది రోజుల పండుగ, దుర్గా మాత విగ్రహాలను విజయదశమినాడు నీటిలో నిమజ్జనంచేయడంతో ముగుస్తుంది. పదవ రోజున చెడును అంతం చేసే సంకేతంగా రావణాసురుడి గడ్డిబొమ్మలను తగులబెట్టి, పటాకులు కాల్చటంతో పండుగ ముగిస్తారు.

English summary
Mother Goddess. Throughout this period, fasts, strictly vegetarian diets, japa (chanting mantras in honor of the Goddess Shakti), religious hymns, prayer, meditation and recitation of sacred texts related to Devi Maa (Mother Goddess) form the order of the day. Apart from this, there are a number of other customs and rituals as well, which are associated with the festival. Let us know more about them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X