వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేణుమాధవ్ చేతులారా చేసుకున్నాడు

By Srikanya
|
Google Oneindia TeluguNews

Venu Madhav
హఠాత్తుగా వేణు మాధవ్ డిమాండ్ పడిపోయింది.ఎక్కడా వేణు మాధవ్ కనిపంచటం లేదు.అటు యాంకర్ గానూ,ఇటు సినిమాల్లోనూ బిజి అనిపించుకున్న వేణు మాధవ్ కి ఈ పరిస్ధితి రావటం వెనక స్వయకృతాపరాధమే ఉందంటున్నారు.ఒకానొక టైమ్ లో తన తోటి కమిడెయన్లు బ్రహ్మానందం, అలీ, సునీల్ లను ప్రక్కకు పెట్టి ఒక్క సంవత్సరంలో నలభై ఏడు సినిమల్లో నటించి రికార్డు సృష్టించాడు.అంతకు తగినట్లే డబ్బుని కూడా సంపాదించాడు.అలాంటిది ఇప్పుడు వేణు మాధవ్ ని పెట్టుకోవటానికి ఎవరూ ఆసక్తి చూపటం లేదు.దానకి కారణం..అతని ప్రవర్తనే అని సినిమా పెద్దలు చెప్తారు.అంతేకాక డిమాండ్ లేని స్ధితిలో కూడా యాభై లక్షలు వరకూ డిమాండ్ చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచే అంశం.

స్టార్ కమెడియన్‌గా వెలుగుతున్న కాలంలో నిర్మాతలని, దర్శకుల్ని అతడు పెట్టిన టార్చర్, ఇబ్బందులు, ప్రదర్శించిన అహంభావమే ఇప్పుడతని మూకమ్మిడి వెలికి కారణమయ్యేలా చేసాయంటారు.అనధికారింకంగా నిషేధం పెట్టినట్లుగా అతన్ని పిలిచే వాళ్ళు కనపడటం లేదు.అదే బ్రహ్మానందం బిహేవరియర్ ఎలా ఉన్నా తెరపై కనపడగానే ప్రేక్షకులనుంచి హీరోకు వచ్చే స్పందన రావటం అతని ప్లస్ అయ్యింది.అంతేగాక వేణుమాధవ్ కి సోలో హీరోగా చేసిన 'భూకైలాస్','ప్రేమాభిషేకం'చిత్రాలు ప్లాప్ అయ్యి అటు హీరోగానూ వెలగలేక,అలాగని కమిడియన్ గానూ వెనక్కి రాలేని పరిస్దితిని తీసుకు వచ్చింది. 'భూకైలాస్' సమయంలో అతడి డిమాండ్లకూ, చేష్టలకూ దర్శకుడు శివనాగేశ్వరరావు విసిగిపోయాడని ఇండస్ట్రీలో వారు చెప్తారు.మరో ప్రక్క వెన్నెల కిషోర్ లాంటి వారు కామిడీ చేయటం కూడా వేణుమాధవ్ కి దెబ్బ కొట్టింది.వేణుమాధవ్ ని ఆ కాలం కామిడీగా పరిగణిస్తున్నారు చాలా మంది.

English summary
Actor Venu Madhav is now a well noted comedian, who is demanding Rs 50 lakhs as his remuneration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X