• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ విషయంలోనూ... తండ్రినే జపిస్తున్న రామ్ చరణ్

By Bojja Kumar
|

మెగా తనయుడు రామ్ చరణ్ తేజను.... ఏ విషయం గురించి అడిగినా ముందు తన తండ్రి చిరంజీవి జపం చేసిన తర్వాతే అసలు మ్యాటర్ లోకి వస్తాడు. రామ్ చరణ్ పదే పదే చిరంజీవి గురించిన చెప్పిన మాటలు వినీ వినీ అప్పుడప్పుడు బోర్ ఫీలైన్ వారూ లేక పోలేదు. అయితే...ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకుని పలువురు మీడియా ప్రతినిధులు ఆయన్ను తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి అడిగితే మరో సారి తన తండ్రి చిరంజీవిని తన పొగడ్తలో ముంచెత్తాడు చరణ్. 'మా నాన్న ను మించిన బెస్ట్ ఫ్రెండ్ తనకు లేడు, ఇప్పుడు నేనీ స్థితిలో ఉండటానికి కారణం నాన్నే, నన్ను ఈ స్థాయిలో చూడాలని ఆయన ఎన్ని కలలు కన్నారో, మేము తండ్రి కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం, ఆయన బయట పెద్ద స్టారే కానీ నా దగ్గర మాత్రం మంచి స్నేహితుడే"" అంటూ డప్పు కొట్టడం మొదలు పెట్టారు.

ఇలా...చరణ్ ప్రతి విషయానికి నాన్నను ముడిపెట్టి మాట్లాడటంపై పలువురు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. తండ్రికి, స్నేహితుడికి తేడా తెలియదా? చిన్నప్పటి నుంచి తండ్రి అతి నియంత్రణలో పెరిగిన చరణ్ స్నేహితులను సంపాదించుకోలేక పోయాడా? అని సందేహాలు వెలుబుచ్చుతున్నారు.

స్నేహితుడికి తండ్రకి చాలా తేడా ఉంది. ఏ దాపరికాలు లేకుండా ఉండగలిగేది ఒక్క స్నేహితుల దగ్గరే. అందుకే మనతో సన్నిహితంగా ఉండే తండ్రిని స్నేహితులతో పోల్చుతారే తప్ప....స్నేహితులను తండ్రితో పోల్చరు. ఎంత చనువుగా ఉన్నా స్నేహితుడు లేని లోటును తండ్రి పూడ్చలేడు. తండ్రి స్థానాన్ని స్నేహితుడు భర్తీ చేయలేడు. మరి రామ్ చరణ్ ఈ విషయం చరణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో....

English summary
Ram charan said ' My Best friend is My father'. but people think other way.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X