వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పు కూడా సిగరెట్ లాగానే..

By Pratap
|
Google Oneindia TeluguNews

Salt
సాధారణంగా, చేపలు, చిప్స్ మొదలైనవి ఉప్పు లేకుండా రుచినివ్వవు. అయితే, సైంటిస్టులు తాజాగా ఉప్పు వాడకం కూడా మాదక ద్రవ్యాలకు లేదా సిగరెట్లకు అలవాటు పడడం లాంటిదేనట. ఉప్పును అలవాటు మేరకు వాడాలనే వాంఛ జన్యువులను, మెదడు కణాలను, మెదడు సంబంధిత చర్యలను అధికం చేస్తుందని వెల్లడించారు. గుండె ఆరోగ్యానికి, బ్లడ్ ప్రెషర్లకు హాని కలిగిస్తున్నప్పటికి ఉప్పును తగ్గించటానికి చాలామంది ఎందుకు వెనుకాడతారనేదాన్ని తెలుసుకోడానికి అవసరమైన సర్వే ఒకటి జరిగింది.

ఈ అధ్యయనానికి గాను ఆస్ట్రేలియన్, అమెరికన్ సైంటిస్టులు కొన్ని ఎలుకలకు తక్కువ ఉప్పు, మరికొన్నిటికి అధిక ఉప్పుగల ఆహారాలను అందించారు. వాటి మెదడులోని చర్యలను సాధారణ ఆహారమిచ్చిన ఎలుకల చర్యలతో పరిశీలించారు. వారు ఉప్పును కోరే ఎలుకలను సైతం మూడు రోజులు పరిశీలించి అపుడు వాటికి తాగటానికి ఉప్పునీటిని అందించారు. ఉప్పును కోరుతున్న ఎలుకల మెదడు కణాలు హెరాయిన్, కోకైన్, నికోటిన్ మొదలైన మాదక పదార్ధాలకు అవసరమైన ప్రొటీన్లను విడుదల చేశాయి.

ఈ అధ్యయనంలో ఉప్పును కోరే వాంఛ మాదక ద్రవ్యాలు లేదా కోకైన్ వాడేవారి వాంఛను ఉప్పు పట్ల వ్యక్తం చేస్తుందని తేలినట్లు మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ. డెరిక్ డెంటన్ వెల్లడించినట్లు ది డైలీ మెయిల్ పత్రిక తెలిపింది. ఉప్పును ఒకసారి తీసుకున్న తర్వాత మెదడు ఇకపై అది సాధ్యం కాకపోయినప్పటికి కోరుతూనే వుంటుందని కూడా ఈ అధ్యయనంలో తేలింది.

సోడియం లోటు వలన కలిగిన జన్యువులు మరల పూర్వ స్ధితికి సరిగ్గా పది నిమిషాలలోకి చేరినట్లు ప్రొ. డెంటన్ చెపుతారు. ఏదైనా ఒక జంతువు నీరు లేదా ఉప్పుకు కొరత పడినపుడు అయిదు లేదా పది ని మిషాలలో దానికి అందుబాటులో వున్నది తాగుతుందని తెలుస్తోంది. ఇంతకీ, ఆరోగ్యంపై ఉప్పు ప్రాధాన్యత వివరించాలంటే దానిని తీసుకోవాలనే వాంఛ ఎంతో బలంగా బ్రెయిన్లో ఒక పురాతన కొరికగా వుండిపోతుంది. ఈ కారణంగానే మనం ఉప్పు వేసిన పదార్ధాలు ఎందుకంత రుచిగా యిష్టపడతామనేది వివరించారు. ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ఈ అధ్యయనం వివరాలను ప్రచురించింది.

English summary
For the study, Australian and American scientists kept some mice on low-salt diets and gave others a salt drip. Activity in the creatures' brains was then compared with that in mice fed normally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X