అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టపర్తిలో నిత్యానందకు 'గౌరవభంగం'

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
సత్య సాయిబాబాను కడసారి చూడడానికి మంగళవారం వచ్చిన స్వామి నిత్యానందకు పుట్టపర్తిలో అడుగడుగునా అవమానమే ఎదురైంది. స్వామి నిత్యానందను సత్య సాయిబాబా బంధువులు అసలు పట్టించుకోనేలేదు. సత్య సాయిబాబా భౌతిక కాయాన్ని ఉంచిన కుల్వంత్ హాల్లోకి ఆయనను వివిఐపి ప్రవేశ ద్వారం ద్వారా అనుమతించలేదు. స్వామి నిత్యానంద పుట్టపర్తికి రావడం పట్ల కూడా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సత్య సాయిబాబా భక్తులు కూడా ఆయన రాకను పెద్దగా గుర్తించలేదు. సత్య సాయిబాబా కుటుంబ సభ్యులు గానీ భక్తులు గానీ గుర్తించకపోవడంతో నిత్యానంద అక్కడ ఉన్నంత సేపు ఇబ్బందిగానే ఫీలయ్యారు.

వివిఐపి ప్రవేశ ద్వారం వద్ద చేతిలో పూలదండ పట్టుకుని నిత్యానంద నిలబడ్డారు. ఇతర ప్రముఖులను పలకరించిన సాయిబాబా బంధువులు నిత్యానంద ఉనికిని గుర్తించనట్లే వెళ్లిపోయారు. తన ఉనికిని గుర్తించకపోవడంతో అతను కామన్ గేట్ ద్వారా లోనికి ప్రవేశించాడు. వివిఐపి ద్వారం ద్వారా అనుమతించాలని అతను సత్య సాయిబాబా కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. క్యూలో నిలబడి సత్య సాయిబాబాను దర్శించాల్సిన పరిస్థితిని అతను ఎదుర్కున్నాడు. నిత్యానంద భారీ పూలదండను సమర్పించి, వంగి నమస్కారం చేస్తున్న సమయంలో స్వచ్ఛంద సేవకులు త్వరగా కదలాలని భక్తులను పురమాయించారు.

కాస్కెట్ నుంచి నిత్యానంద వేగంగా కదిలి సత్య సాయిబాబా నిలువెత్తు విగ్రహం వెనక నుంచి విఐపి గేటు ద్వారా బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు, అతన్ని నిలిపేసి, సాధారణ భక్తులు వెళ్లే మార్గం గుండా వెళ్లాలని ఆదేశించారు. అక్కడి నుంచి వేగంగా కదిలి నిత్యానంద బయటకు వెళ్లిపోయాడు.

English summary
Late Sathya Sai Baba's relatives ignored Swami Nithyananda's presence at the Sai Kulwanth Hall yesterday; made efforts to ensure that he isn't allowed into the auditorium through VVIP entrance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X