వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: కుల్దీప్ నయ్యర్ అమ్ముడు పోయారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kuldeep Nayar
కాశ్మీర్ ఉద్యమానికి అనుకూలంగా, భారత దేశ భౌగోళికత దెబ్బ తినేలా ప్రముఖ కాలమిస్టు కుల్దీప్ నయ్యర్ డబ్బులు తీసుకొని ప్రత్యేకంగా కథనాలు రాసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కాశ్మీర్ వివాదంపై పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తరఫున అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాడన్న అభియోగంపై ఎఫ్‌బిఐ అధికారులు గులాం నభీ ఫాయిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను విచారించిన ఎఫ్‌బిఐ భయంకర నిజాలు బయట తెలిపింది. కాశ్మీర్ వేర్పాటు వాదానికి మద్దతుగా అమెరికా ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టడంతో పాటు, భారతదేశంలోని ప్రముఖ జర్నలిస్టులను, మేథావుల్లోనూ తన నెట్ వర్కును ఫాయి విస్తరించినట్టు అధికారులు తమ అఫిడవిట్‌లో స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి.

అందులో కాలమిస్టు కుల్దీప్ నయ్యర్ పేరు సైతం ఉందని ఆరోపణలు వచ్చాయి. కాశ్మీర్ ఉద్యమానికి అనుకూలంగా మాట్లాడే వారిని ఫాయి కూడగట్టి, కాశ్మీర్ కౌన్సిల్ బ్యానర్‌పై ఈ పనులన్నీ చేసే వాడు. దానికి ఐఎస్ఐ నుండి ఫాయి కోట్లాది రూపాయలు తీసుకునే వాడు. గత ఏడాది జూలైలో అమెరికాలోని కాపిటల్ హిల్ ప్రాంతంలో జరిగిన కాశఅమీర్ అంతర్జాతీయ శాంతి సదస్సు, భారత్ పాక్ సంబంధాలు, కాశ్మీర్ పై ప్రతిష్టంభన తొలగింపు అనే అంశంపై ప్రధానంగా చర్చించిన ఐదుగురు ముసాయిదా కమిటిలో కుల్దీప్ సైతం ఉన్నారని తెలుస్తోంది. అయితే దేశ భౌగోళికతకు నష్టం చేకూర్చేలా కాశ్మీర్‌పై విషం కక్కించేందుకు కూల్దీప్ నయ్యర్‌ను ఫాయి ఉపయోగించుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ వాదలలో మరో అనుమానం బలపడుతోంది. దేశంపైనే విషం కక్కడానికి సిద్దపడ్డ కుల్దీప్ దేశ అంతర్గతమైన తెలంగాణ సమస్యపై డబ్బులు తీసుకొని వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అందులో భాగంగానే ఇటీవల కుల్దీప్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో విజయవాడలో తెలంగాణ అవసరం లేదని, రాష్ట్రం విడిపోవాల్సిన అవసరం లేదని కుల్దీప్ చెప్పారు. ఆ తర్వాత ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన తెలంగాణ ఒక అమంజసమైన డిమాండ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. చిన్న రాష్ట్రాలతో నష్టం అని చెప్పాడు. తెలంగాణ విడిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అంబేడ్కర్ వంటి మహానేతలు చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి అని చెప్పారు. నేటి కాలపు మహామహులు సైతం తెలంగాణకు మద్దతు పలుకుతున్నారు. ప్రత్యేకంగా సీమాంధ్రకు చెందిన పలు రచయిత సంఘాలు తెలంగాణకు మద్దతు పలుకుతున్నాయి. ఇలాంటి సమయంలో కుల్దీప్ సీమాంధ్ర పెట్టుబడిదారులకు అమ్ముడుపోయి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Telanganites suspecting well known columnist Kuldeep Nayar's attitude on separate Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X