వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కువ రోజులు కొనసాగుతున్న అతిధిని సాగనంపటం ఎలా?

By B N Sharma
|
Google Oneindia TeluguNews

House Guests
సాధారణంగా ప్రతిఒక్కరూ తమ ఇంటికి ఎవరో ఒకరు అతిధిగా రావాలనే అనుకుంటారు. వచ్చిన వారికి సకల మర్యాదలూ చేస్తూనే వుంటారు. అయితే వచ్చిన అతిధి చేస్తున్న మర్యాదలను స్వీకరిస్తూ తాను ఎన్నాళ్ళండేదీ మీకు చెప్పకుండానే కొనసాగిచ్చేస్తూ వుంటే, ఇంట్లో వారికి కొంత అసౌకర్యంగానే వుంటుంది. అన్నిటిని మించి మన పనులు సైతం వాయిదాలు పడుతూంటాయి. లేదా కేన్సిల్ చేసుకోవాల్సి వుంటుంది. ఈ కేటగిరీ కిచెందిన దీర్ఘకాల అతిధులను ఏ రకంగా మేనేజ్ చేయాలన్న దానిపై కొన్ని టిప్స్ కింద ఇవ్వబడ్డాయి.

-మీ అతిధి కనుక ఫోన్ చేసి తాను వస్తున్నానని చెపితే, అతనికి ముందుగా మీకు గల అపాయింట్ మెంట్లు తెలుపండి. ఉదాహరణకు ఆదివారం వస్తున్నానని చెపితే, ఆ రోజు సాధారణంగా మీరు లేటుగా నిద్ర లేవాలనుకుంటారు. అందుకని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు రావలసినదిగా సూచన ఇవ్వండి.

-ఒక వేళ మీ అతిధి కనుక మరో రెండు రోజుల పాటు వుండిపోదలిస్తే, మీకు వారాంతపు సెలవులలోనే కలిసి ఆనందించటం కుదరగలదని తెలుపండి. దీనితో పని దినాలలో మీరు బిజీగా వుంటారన్న విషయం అతనికి అర్ధం అవుతుంది.

-అదే రకంగా మీ ఇంటి నిబంధనలు సైతం అతిధికి తెలియజేయండి. ఎందుకంటే, కొంతమంది మీ ఇంటి అలవాట్లకు అసౌకర్యం భావించి త్వరగా వెళ్ళి పోయే అవకాశం కూడా వుంది.
-మీకు ఎవరైనా అతిధి యొక్క ప్రవర్తన నచ్చకపోతే, అతనికి మీరు ఆ విషయం తెలియపరచాలి. అతను ఏదైనా చేయరాని పని చేసినా లేదా చెప్పినా దాని ప్రభావం మీ ఇంటిలోని పిల్లలపై తప్పక పడగలదు. అందుకని ఆ విషయం వారికి చెప్పాలి.

-వచ్చిన అతిధి ప్రవర్తన ఎలా వుందనే దానిపై బాహాటంగా వ్యవహరించండి. అతనిని అభినందించాల్సి వచ్చినా సరే లేదా విమర్శించాల్సి వచ్చినా సరే దానిని తెలుపటం మంచిది. దీనితో వచ్చిన అతిధి మీరు ఏదైనా ఆమోదించేస్తారనే భావనకు దూరంగా వుంటాడు.

-వచ్చిన అతిధితో వీలైనంత మేరకు మీరు బయటి పనులు నిర్వహించుకుంటూనే అతనిని షికార్లకు తిప్పండి దానితో అతిధి కొరకు మీరు పూర్తిగా టైమును కేటాయించనవసరం లేదు. బయటకు వెళ్ళినపుడు అతని ఖర్చులు మీరు భరించకండి. ఆటో ఛర్జీలు, లేదా బస్ టికెట్లు తాను తీసుకుంటానంటే అంగీకరించండి. వచ్చిన ప్రతి అతిధి ఎంతో కొంత మీతో ఖర్చు పెట్టించాలనే చూస్తాడు.

-వచ్చిన అతిధితో మీరు ఎంత సంతోషంగా వున్నారో, మరల అతనిని ఏ విధంగా స్వాగతిస్తారో అతనికి తెలియజేయండి. దీనితో అతను వెళ్ళే సమయం వచ్చినట్లు సూచించినట్లవుతుంది.

అతిధి వస్తే ఆనందమే. అయితే వారితో పాటు మనం కూడా అలసి పోయే ప్రమాదముంది. ఈ టిప్స్ కనుక ఆచరిస్తే, మీకు పెద్ద భారం లేకుండా వారి రాకను ఆనందించటమైనట్లవుతుంది.

English summary
You are very excited about a house guest who is visiting you after a long time. You make arrangements to make the guest feel very comfortable. However, your guest is so happy about the hospitality extended that he prefers to extend his stay = but without your consent. This creates a very awkward situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X