వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా బాబుల వారసత్వ జిమ్మిక్కులు!

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

Stars
సినిమా నటులుగా పరిశ్రమలో అగ్ర స్థానానికి ఎదగటానికి, సినిమాలు విజయవంతంగా నడిపించుకోవడానికి మన తెలుగు సినీ పరిశ్రమలో మొదట ఉండాల్సిన అర్హత వారసత్వం. ఇక్కడ వారసత్వం ఉంటే చాలు...ఎలాగో అలా ఇండస్ట్రీలో లాగించుకురావొచ్చు. వారసత్వ కథానాయకుల హవా పెరిగిన తర్వాత సినిమాలకే కాదు, సినిమాల్లో పాటలకు కూడా వారసత్వ పోకడ వచ్చింది. తండ్రి, తాతల సినిమాల్లో సూపర్ హిట్టయిన పాటలను మళ్లీ తమ సినిమాల్లో చూపించి జనాలకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం హీరోలు. ఇలా చేయడం ద్వారా సినిమాపై మరింత అంచనాలు పెంచాలనేదే వారి ఆలోచన.

పరిశ్రమలో ప్రముఖంగా ఎదిగిన నందమూరి, అక్కినేని, కృష్ణ, మెగాస్టార్, మోహన్ బాబు కుటుంబాల వారసులు...వారసత్వాన్ని వాడుకుంటూ తమ సినిమాలను గెలిపించుకుంటున్నారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడులో బంగారు కోడి పెట్ట పాట మగధీరలోనూ వినిపించింది. ఈ గీతంలో చిరంజీవి, చరణ్ కలిసి వేసిన స్టెప్పులు అభిమానుల్ని అలరించాయి. ఇక కృష్ణ నటించిన 'గౌరి" సినిమాలో గలగల పారుతున్న గోదారిలా.. పాటను మహేష్ బాబు తన పోకిరి సినిమాలో వాడుకున్నాడు. ఇలాంటి విషయాల్లో నందమూరి వంశ కథానాయకుడు బాలయ్య ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తుంటారు. తండ్రి ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్టయిన పాటలను తన సినిమాల్లో పెట్టించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ నటించిన ఛాలెంజ్ రాముడు, భలే తమ్ముడు సినిమాల్లోని పాటలను తన సినిమాల్లో వాడుకున్నాడు. ఇదే విధంగా మన్మధుడు నాగార్జున నాన్న నాగేశ్వరావు పాటల మీదన మమకారం చూపించి తన సినిమాల్లో వేయించుకున్నాడు.

ఇలా చేయడం వెయడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. తమ సినిమాలకు వ్యాపారం జోరుగా సాగడంతో పాటు, తమ తండ్రులు, తాతల పేర్లు మరోసారి జనాల నోల్లలో నానాలనేది వారి ఆలోచన. పైగా అభిమానులు కూడా ఇలాంటి వాటిపై తెగ ఆసక్తి చూపుతుంటారు కాబట్టి వారిని సంతోష పరిచినట్లు ఉంటుంది. ఏదైతేనేం? ఇలాంటి ప్రయోగాల వల్ల డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, అభిమానానికి అభిమానం. ఇలా అన్నీ వీజీగా వస్తుండ బట్టే మన తెలుగునాట వారసత్వ జోరు కొనసాగుతోంది.

English summary
Telugu cine stars encouraging their heirs in film industry to increase businees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X