వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్‌జీకి గణపతి, ఇతర నేతలతో విభేదాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishenji
మావోయిస్టు నేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావుతో అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్‌జీతో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు కూడా తీవ్రంగా విభేదించినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో కిషన్‌జీ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు ఎదురు దెబ్బగానే భావిస్తున్నప్పటికీ మావోయిస్టు పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ పోలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి గణపతి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ నంబాల కేశవరావు, ప్రశాంత బోస్ అలియాస్ కిషన్‌దా ఉన్నారు. మొదటి ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాత పీపుల్స్‌వార్ నేతలు కాగా, కిషన్‌దా మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి)కి చెందినవాడు.

కిషన్‌జీ మరణంతో మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో బాధ్యతలను కిషన్‌దా చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కిందికి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అస్సాం రాష్ట్రాలతో పాటు యుపి, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌ల్లోని కొన్ని జిల్లాలు వస్తాయి. కిషన్‌జీ మరణంతో లాల్‌గడ్ ప్రయోగంపై మావోయిస్టులు పునరాలోచన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కిషన్‌జీ పట్ల ఆ త్రయం అసంతృప్తికి పలు కారణాలున్నాయని అంటున్నారు. వాటిలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీకి మద్దతివ్వడం ప్రధామైంది. ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో ఆ ముగ్గురు అగ్రనేతలు కిషన్‌జీపై తీవ్ర విమర్శలు పెట్టినట్లు తెలుస్తోంది. మీడియాతో కిషన్‌జీ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని కూడా తప్పు పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

విప్లవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ క్యాడర్‌ను పెంచుకునే దిశగా కాకుండా కిషన్‌జీ నాయకత్వం రాజకీయ ప్రతీకారానికి ప్రాధాన్యం ఇచ్చిందని అంటున్నారు. సిపిఎంను గద్దె దించడానికి తృణమూల్ కాంగ్రెసుకు మద్దతివ్వడం పెద్ద తప్పిదంగా భావించినట్లు సమాచారం. ఆ చర్యలే ఇప్పుడు కిషన్‌జీ ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టిందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రజా సంఘాలకు చెందినవారు పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారి, మావోయిస్టులకు వ్యతిరేక గుంపులు తయారైనట్లు చెబుతున్నారు. మొత్తంగా లాల్‌గఢ్ ప్రయోగం విఫలమైనట్లు చెబుతున్నారు.

English summary
Kishanji's death in an encounter in West Bengal is a rude jolt to the Maoists, but the Politburo Standing Committee, the supreme body of the Red ultras, is intact.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X