వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేశ్వర్ రెడ్డి హవా, మంత్రి కుమారుడెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

ACB
ఎసిపి సర్వేశ్వర్ రెడ్డి ఆస్తుల గుట్టు విప్పేందుకు ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) 20 చోట్ల దాడులు నిర్వహించింది. దాదాపు ఆరు కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడినట్లు వార్తలు వచ్చాయి. తనిఖీలను ఆపించడంలో, సర్వేశ్వర్ రెడ్డి లాకర్లను తెరవడాన్ని నిరోధించడంలో ఆ మంత్రి ప్రముఖ పాత్ర వహించారంటూ ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. సర్వేశ్వర్ రెడ్డి సెటిల్‌మెంట్లు చేస్తూ తాను 25 శాతం వాటా తీసుకుంటూ, ఓ మంత్రి కుమారుడికి 75 శాతం వాటా ఇస్తూ వస్తున్నారంటూ కూడా ఆరోపించింది. దాంతోనే సర్వేశ్వర్ రెడ్డి బ్యాంక్ లాకర్లను ఎసిబి అధికారులు తెరవలేకపోయారని తెలిపింది. ఈ వార్తాకథనంతో ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రి కుమారుడు ఎవరనే విషయంపై ఉత్కంఠ చోటు చేసుకుంది. పలు ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. అయితే, ఊహించడానికి కూడా ఆ వార్తాకథనం అనుకూలంగానే ఉంది.

ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - ఎస్ఐ నుంచి డిఎస్పీ దాకా అంచెలంచెలుగా ప్రమోషన్లు పొందినా కూడా సర్వేశ్వర్ రెడ్డి ఒకే చోట ఉంటూ వస్తున్నారు. ఒక్కసారి మాత్రం తప్పని స్థితిలో అతను బయటకు వెళ్లాడట. అది కూడా వికారాబాదులో రెండు మూడు రోజులే పనిచేశారు. బదిలీలు చేసి ఇతర ప్రాంతాలకు పంపించడం ఆనవాయితీ, కానీ సర్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోనే తిష్ట వేశాడు. హైదరాబాదు చుట్టూ అతను ఓ మంత్రి కుమారుడితో కలిసి సెటిల్‌మెంట్లు చేస్తుంటాడని ఆరోపణలున్నాయి. అదనపు ఎస్పీ స్థాయి అధికారికి మాత్రమే ఓఎస్డీ పదవి వస్తుంది. కానీ, ఎసిపి స్థాయి అధికారి అయినప్పటికీ సర్వేశ్వర్ రెడ్డికి ఓఎస్డీ పదవి దక్కింది.

ఆ వార్తా పత్రిక కథనం ప్రకారమే - సర్వేశ్వర్ రెడ్డి లాకర్లనే కాకుండా అతని బంధువులు, సన్నిహితుల బ్యాంక్ లాకర్లను కూడా ఎసిబి తెరవలేక చేతులెత్తేసింది. సర్వేశ్వర్ రెడ్డికి 450 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మాదాపూర్‌లో సర్వేశ్వర్ రెడ్డ్డికి బినామీల పేరు మీద 500 గజాల విస్తీర్ణంలో భారీ భవనం ఉన్నట్లు సమాచారం. దీని విలువ 30 కోట్ల రూపాయల దాకా ఉంటుంది.

English summary
According to news report - A minister was influenced ACB to stop raids on ACP Sarweswar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X