వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డర్టీ పిక్చర్: సిల్క్ స్మిత మృత్యు రహస్యం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Silk Smitha
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ దక్షిణాది తార సిల్క్ స్మిత మృత్యు రహస్యాన్ని ఛేదిస్తుందా అనే ప్రశ్న ముందుకు వచ్చింది. కైపెక్కించే కనులతో, మత్తెక్కించే శృంగార భంగిమలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దక్షిణాది తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా హిందీలో డర్టీ పిక్చర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను విద్యా బాలన్ పోషిస్తోంది. నిర్మాణంలో ఉండగానే చిత్రాన్ని రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా, సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు ఆ సినిమా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో అప్పట్లో సిల్క్ స్మిత నృత్యం లేకుండా సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఐటం గర్ల్‌కు పోత పోసిన నటి సిల్క్ స్మిత.

కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్న సిల్క్ స్మిత జీవితం విషాదాంతమైంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ మృత్యువు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆమె మరణంపై ఇప్పటికీ ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. డర్టీ పిక్చర్ కేవలం సిల్క్ స్మిత నట జీవితంపైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. దాంట్లో ఆమె మృత్యు రహస్యాన్ని విప్పే ప్రయత్నం కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే, సిల్క్ స్మిత జీవితంపై తమను సంప్రదించకుండానే సినిమా తీస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సిల్క్ స్మిత బాయ్ ఫ్రెండ్‌ ఒకరితో మాట్లాడి రజత్ అరోరా స్క్రిప్టును తయారు చేశారని, అందులో సిల్క్ స్మిత మరణం కూడా ఉంటుందని అంటున్నారు.

సిల్క్ స్మిత జీవితం కష్టాల్లోనే సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన సిల్క్ స్మిత పేదరికంతో కొట్టుమిట్టాడింది. ఆమె తండ్రికి ఇద్దరు భార్యలు. ఈమె మొదటి భార్య కూతురు. నాలుగో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో చెన్నైలో కాలు పెట్టింది. కానీ, ఆమెకు అది సులభం కాలేదు. మేకప్ ఉమెన్‌గా రంగ ప్రవేశం చేసింది. బి గ్రేడ్ నటులకు ఆమె మేకప్ చేసేది. ఆ సమయాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పోయింది. అదే సమయంలో ఆమెకు ఓ మలయాళీ సినిమాలో బార్ గర్ల్ పాత్ర వచ్చింది. దాంతో విజయలక్ష్మి కాస్తా సిల్క్ స్మితగా మారింది. ఆమె కెరీర్ మలుపు తిరిగింది. బార్ గర్ల్‌గా నటించడంతో ఆమె సినిమాల్లో ఐటం గర్ల్‌గా స్థిరపడాల్సి వచ్చింది. 1970 దశకంలో చిత్ర సీమలోకి అడుగు పెట్టిన సిల్క్ స్మిత 450 సినిమాల్లో తన సత్తా చాటింది. జీవితం సినిమాల్లో ఐటం గర్ల్‌గా చేస్తున్న కాలంలోనే 1996లో ఆమె జీవితం ఆకస్మికంగా ముగిసింది. సినీ రంగంలో ఓ సంచలనం సృష్టించిన సిల్క్ స్మిత జీవితం ఇప్పటికి ఓ సినిమాకు కథావస్తువైంది. ఆమెను సినిమాలో ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగానే ఉంది. ఆ డర్టీ పిక్చర్ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
It is said that Dirty Picture film may focus on Silk Smitha's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X