వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైన్ తాగితే సన్ బరన్స్ నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చట!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Wine can prevent Sunburn
వైన్ తాగితే, గుండెకు మంచిది. వైన్ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. కాగా, వాటికి ఇపుడు మరో ప్రయోజనం కూడా తోడైందంటున్నారు రీసెర్చర్సు. కొత్త అధ్యయనం మేరకు వైన్ తాగుడు మిమ్మల్ని చర్మానికి కలిగే సన్ బరన్స్ నుండి కూడా రక్షిస్తుందట.

వైన్ తయారీలో ప్రధానంగా ఉండే ద్రాక్ష పండు లో ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనం ఉంటుందని ఇది సెల్ డామేజీని అరికడుతుందని రీసెర్చర్స్ చెపుతున్నారు. ఈ విషయాన్ని అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్లో కూడా తాజాగా ప్రచురించారు. సూర్యుడి నుండి వచ్చే అల్ట్రా వయోలెట్ కిరణాలు చర్మాన్ని తాకుతూంటే జరిగే కెమికల్ రియాక్షన్ ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. గ్రేప్స్ ప్రధానంగా వున్న వైన్ లో ఈ కెమికల్ రియాక్షన్ ను అరికట్టగల ఫ్లేవనాయిడ్స్ వున్నాయని, ఇవి కెమికల్ రియాక్షన్ ను అరికట్టి చర్మం కణాలు దెబ్బతినకుండా చేస్తాయని కనుగొన్నారు.

అంతే కాదు, వైన్ చర్మాన్ని కేన్సర్ బారి పడకుండాకూడా కాపాడుతుందట. ఈ రీసెర్చి కనుక మరికొంత ముందుకు వెళితే, చర్మ సంరక్షణా క్రీములకు సైతం వైన్ ఉపయోగ పడొచ్చు. సోలార్ రేడియేషన్ ప్రభావం శరీర చర్మంపై పడకుండా చూసుకోవడంలో వైన్ ప్రాముఖ్యత వుండగలదని ఈ శాస్త్రవేత్తలు డైలీ టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

English summary
Researchers from the University of Barcelona and the Spanish National Research Council have carried out a study and found that grapes, the main ingredient of wine contain a chemical, called flavonoids, which can liit cell damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X