వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనాభా విస్ఫోటనం: సెకనుకు 5, అక్టోబర్ కి 700 కోట్లు!

|
Google Oneindia TeluguNews

World Population
పుడమిపై మానవుని భారం రోజు రోజుకు పెరుగుతుంది.. పలు దేశాలు జనాభా నియంత్రణకు చర్యలు చేపడతున్నా.. అవి పూర్తి స్థాయిలో ఫలించటం లేదు. ప్రతి సెకనుకు 5గురు చిన్నారులు జన్మిస్తున్నారు.. ప్రపంచ జనాభా అక్టోబర్ చివరి నాటికి 700 కోట్లకు చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇలా సెకనుకు ఐదుగురు జన్మించటం వల్ల ఏటా ప్రపంచ జనాభాకు అదనంగా 7.8 కోట్లు పెరుగుతుంది. పది సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా దాదాపు 600 కోట్లు ఉండేది. అయితే ఈ సంఖ్య అక్టోబర్ చివరి నాటికి 700 కోట్లకు చేరుకోనుందని డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది.

గత 50 సంవత్సరాలుగు ప్రపంచ జనభా గణాంకాలను పరిశీలిస్తే 1960లో ప్రపంచ జనాభా 300 కోట్లు ఉండగా, 1999 నాటికి ఆ సంఖ్య 600 కోట్లకు చేరుకుంది. 2025 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవచ్చని ఐక్య రాజ్య సమతి లెక్కలు అంచనా వేస్తున్నాయి. ప్రతి ఏటా 8 కోట్ల చొప్పున జనాభా పెరుగుతుండటం వల్ల ఆందోళణ తప్పదని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

' 7 బిలియన్ " శీర్షికతో 'నేషనల్ జియోగ్రాఫిక్" ఓ మ్యాగజైన్ ను విడుదల చేసింది. ప్రచురితమైన ఈ శీర్షికకు సంబంధించిన ఓ వ్యాసంలో రాబర్ట్ కుజింగ్ పలు కీలక అంశాలను వెల్లడించారు. ' ప్రస్తుతం భూగోళం పై నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి... అలాగే మత్స్య సంపత కూడా కనుమరుగుయిపోతుంది.. ప్రతి ఏటా దాదాపు 100 కోట్ల మంది కడుపునిండా తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారని" హెచ్చరించారు. ఈ ప్రభావం కారణంగా ఆహార కొరత ఏర్పడుతుందని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 20 సంవత్సరాల మధ్య యువకులు 180 కోట్ల మంది ఉన్నారు. జనాభా నిలకడగా ఉంచటానికి ప్రతి జంటకు సగటున 2.1 మంది పిల్లలు మాత్రమే ఉండాలని నిపుణులు అంటున్నారు. కాగా ఐరోపా, తూర్పు ఆసియా దేశాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యకు తగినట్లుగా యువకులు లేకపోవడం పై ఆందోళణ పెరుగుతోంది.

English summary
Are you know the number of World Population..?? You should be surprised that the number of world population is 689 crore 58 lakh 89 thousand. The rate of population growth is 1.16%. Density of population per square kilometre is 51. Specialist predict that after the end of next October in this year the population will cross 700 crore. They also said that in 2050 the population of the world will be 930 crore. It is really a sad statistics for us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X