హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని జైళ్లలో ఇక సెల్‌ఫోన్ల సందడి

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చర్లపల్లి జైలులో టెలిఫోన్ సౌకర్యం సత్ఫలితాలను ఇస్తోంది. ఖైదీలకు అది ప్రయోజనకరంగా కూడా ఉంది. దీంతో రాష్టంలోని అన్ని జైళ్లలోనూ టెలిఫోన్ సౌకర్యం కల్పించే ఆలోచనలో రాష్ట్ర జైళ్ల శాఖ ఉంది. జైళ్లలోకి సెల్‌ఫోన్ల స్మగ్లింగు నివారణకు ఈ వసతి ఏర్పాటును జైళ్ల శాఖ ప్రయోగాత్మకంగా చర్లపల్లి జైలులో ప్రవేశపెట్టింది.

జైళ్లలో ఫోన్లను అనుమతించడం వల్ల ఖైదీలు అధికారికంగా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వీలు కలుగుతుంది. అందుకు ఖైదీ నెలకు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఖైదీల విజ్ఝప్తుల మేరకు చంచల్‌గుడా కేంద్ర కారాగారంలో ఫోన్ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నామని, ఆ తర్వాత దాన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి జైలుకు విస్తరిస్తామని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ టిపి దాస్ ఓ వార్తాసంస్థ ప్రతినిధితో చెప్పారు.

ఫోన్ సౌకర్యం ఉంటే జైళ్లలో ఉన్న తమవారి కోసం వచ్చే బంధువుల సంఖ్య కూడా తగ్గుతుందని, జైళ్లలో తమవారిని చూసేందుకు సుదారాల నుంచి రావాల్సిన శ్రమ కూడా తప్పుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. తరుచుగా కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడడం వల్ల ఖైదీలు మానసికంగా ఊరట పొందుతారని, దానిల్ల మానసిక స్థిరత్వం ఉంటుందని దాస్ అంటున్నారు.

వ్యయం, సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక, సాఫ్ట్‌వేర్ ఏర్పాటు వంటి విషయాలను పరిశీలిస్తున్నామని, ఖైదీలు జరిపే సంభాషణలను రికార్డు చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ ఏర్పాటు అని, భద్రత దృష్ట్యా అది అవసరమని దాస్ అన్నారు. చంచల్‌గుడా, రాజమండ్రి జైళ్లలో ఆ సౌకర్యం వచ్చే మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

చర్లపల్లి జైలులో మొబైల్ ఫోన్ల సౌకర్యాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టారు. జైలు నుంచి బయటకు 150 కాల్స్ వెళ్లాయని, దాదాపు 2 వేల మంది సెల్‌ఫోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని మరో అధికారి చెప్పారు.

English summary
After the introduction of telephone facility at the Cherlapally Central Prison in Hyderabad evoked a good response among jail inmates, the Andhra Pradesh Department of Prisons has decided to extend the service to other central jails in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X