చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసీం త్రివేది ఇష్యూపై సురేంద్ర: భయపెట్టడానికే...

By Pratap
|
Google Oneindia TeluguNews

Surendra
హైదరాబాద్: హైదరాబాద్: వెబ్‌లో జాతీయ చిహ్నాన్ని, దానిపై ఉన్న నినాదాన్ని అవమానపరుస్తూ కార్టూన్లు వేశాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కాన్పూర్‌కు చెందిన కార్టూనిస్టు అసీం త్రివేది అరెస్టయ్యారు. అయితే, ఈ అరెస్టుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసీం త్రివేదికి బెయిల్ లభించింది. ఆయనపై రాజద్రోహం కేసు ఆలోచనను విరమించుకోనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో కార్టూనిస్టుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అందులో భాగంగా ది హిందూ దినపత్రిక కార్టూనిస్టు సురేంద్ర, భిప్రాయాన్ని సేకరించాం. ఆయన మాటల్లో ఆ అభిప్రాయాన్ని చదవండి....

"అసీం త్రివేది ప్రొఫెషనల్ కార్టూనిస్టు కాడు. యాక్టివిస్టు కార్టూనిస్టు. అసీం త్రివేది వేసిన కార్టూన్లు ఏ పత్రికలోనూ వేసుకోవడానికి కుదరవు. బ్యాడ్ టేస్టు కార్టూన్లు. వాటిని వేసుకోవడానికి ఏ పత్రికలో కూడా అచ్చు వేయడానికి కుదరదు. రాజద్రోహం అనే పదానికి అర్థం తెలుసుకోకుండా అసీం త్రీవేదిపై కేసు పెట్టారు. కార్టూన్సుకు ఆ కేసుకు సంబంధం లేదు. అతను ఒక్కడిని లొంగదీసుకోవడానికి ఆ కేసు పెట్టలేదు. మిగతావారిని భయపెట్టడానికి ఆ కేసు పెట్టారు.

నిజానికి, అసీం త్రివేదిని మిగతా కార్టూనిస్టుల సరసన కూర్చోబెట్టి చూడడం సరి కాదు. ఉద్యమానికి సంబంధించిన కార్టూన్లే అతను వేస్తాడు. దాన్ని ఆపలేరు కూడా. ప్రజాస్వామ్యంలో మనకు నచ్చనివి చాలా జరుగుతుంటాయి. అంత మాత్రాన రాజద్రోహం కేసు పెట్టి వేధించడం సరి కాదు. వినాయక్ సేన్ మీద పెట్టినట్లే అసీం త్రివేది మీద కేసు పెట్టారు. మిగతావారిని భయపెట్టడానికే వినాయక్ సేన్ మీద కేసు పెట్టారు. అలాగే ఇది కూడా.

అసీం త్రివేది చెప్పిన విషయాల మీద ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ చెప్పిన పద్ధతే బాగా లేదు. చిన్న కారణం మీద ఇంత పెద్ద కేసు పెట్టడం కూడా సరి కాదు. యాక్టివిస్టు కార్టూనిస్టును, ప్రొఫెషనల్ కార్టూనిస్టులను ఒకే గాట కట్టేడయం సరి కాదు. సోషల్ నెట్‌వర్క్‌లో మాత్రమే ఆసీం త్రివేది వేసినలాంటి కార్టూన్లు వచ్చే వీలుంది. ప్రింట్ మీడియాలో గానీ విజ్యువల్ మీడియాలో గానీ అటువంటి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.

ఏమైనా అంటే పాశ్యాత్య దేశాల్లో వచ్చే కార్టూన్ల గురించి మాట్లాడుతున్నారు. బట్టలు విప్పేసి నగ్నంగా అక్కడ కార్టూన్లు వేస్తారని మాట్లాడుతారు. మనది అంత లిబరల్ వ్యవస్థ కాదు. అలా వేయడానికి భారతదేశంలో కుదరదు.

- సురేంద్ర, కార్టూనిస్టు, ది హిందూ దినపత్రి, చెన్నై

"మనం స్పేచ్ఛా ప్రపంచంలో నివసిస్తున్నామా, నియంతృత్వంలో ఉన్నామా? మమతా బెనర్జీ కార్టూనిస్టును అరెస్టు చేయించారు, ఇప్పుడు ముంబై పోలీసులు మరో కార్టూనిస్టును అరెస్టు చేశారు. అసెంబ్లీలో పోర్న్ చూడడం నేరం కాదా? పార్లమెంటులో చేయి చేసుకోవడం నేరం కాదా? జాతీయ జెండాను గానీ జాతీయ చిహ్నాన్ని గానీ ఎవరు అవమానించకూడదు. ఆగ్రహానికి అది అభివ్యక్తి, అది అవమానించడం కాదు. కార్టూనిస్టు వ్యక్తీకరణకు ఎవరైనా బాధపడేవారు సిగ్గుపడాలి. వారి గురించి దేశం విచారం వ్యక్తం చేయాలి. అసీం త్రివేది ఓ కార్టూనిస్టు. కానీ రాజకీయ నాయకులు, అధికారులు కార్టూన్లకు మించిన క్యారెక్టర్లు".

మృత్యుంజయ, కార్టూనిస్టు, నమస్తే తెలంగాణ డైలీ

English summary
Aseem Trivedi is a renowned Indian political cartoonist and activist, best known for his anti corruption campaign Cartoons Against Corruption. An Indian cartoonist detained for his drawings satirising widespread corruption among India's political elite has been jailed for two weeks after he refused bail in protest at the sedition charges against him. If found guilty of sedition, he could face a lengthy prison service. The Hindu daily news paper cartoonist Surendra expressed his opinion on Aseem Trivedi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X