వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాం అల్లర్లు: పాంప్లెట్లపై ఎంపి అసదుద్దీన్ ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assam Map
అస్సాం అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రం నుండే కాకుండా, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాలలో ఉన్న ఈశాన్య రాష్ట్రవాసులు కూడా అయా ప్రాంతాలు విడిచి వెళుతున్నారు. ఇప్పటికే బెంగళూరు నుండి వేలాది మంది, హైదరాబాదు నుండి వందల మంది తమ తమ సొంత రాష్ట్రాలకు ఈశాన్యవాసులు వెళ్లిపోయారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బెదిరింపు మెసేజ్‌లు, బెదిరింపు ఫోన్ కాల్స్ కారణంగానే వారు హైదరాబాద్, బెంగళూరులు విడిచి వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా హైదరాబాదులోని ఈశాన్య రాష్ట్ర వాసులు ఉన్న ప్రాంతాలలో వారికి వ్యతిరేకంగా, బెదిరింపులతో పాంప్లెట్లు కూడా వెలిశాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, పాంప్లెట్ల నేపథ్యంలో ఆందోళనకు గురైన వారు నగరాలు విడిచి వెళ్లిపోతున్నారు. అయితే హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాత్రం పాంప్లెట్ల అంశాన్ని ఖండించారు. హైదరాబాదులో ఈశాన్య రాష్ట్రవాసులకు వ్యతిరేకంగా ఎలాంటి కరపత్రాలు వెలువడలేదని, భయాందోళనకు గురి చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు.

హైటెక్ సిటీ ప్రాంతంలోని సిద్ధిక్ నగర్ నుండి బుధ, గురువారాల్లో చాలామంది తమ సొంత రాష్ట్రానికి పయనమయ్యారు. అయితే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం వారు బెదిరింపుల కారణంగా వెళ్లలేదని, అక్కడి పరిస్థితుల దృష్ట్యా తమ కుటుంబ సభ్యులు పిలిచినందు వల్లే వెళ్లారని చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రవాసులు నగరం విడిచి వెళ్లే అంశంపై డిజిపి దినేష్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఎపిలో వారు నిర్భయంగా ఉండవచ్చుని చెప్పారు.

ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, వారు ఉన్న చోట ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులను నియమిస్తామని, పుకార్లు, వదంతులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వదంతులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఈశాన్య రాష్ట్ర వాసులు నిర్భయంగా ఉండవచ్చునని, పోలీసులు రక్షణ కల్పిస్తారని, ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నరని, ఎవరూ రాష్ట్రం విడిచి వెళ్లవద్దన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, బెంగళూరు నుండి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో సాయుధ బలగాలతో రక్షణ కల్పిస్తామన్నారు. రాష్ట్రం నుండి సుమారు 500 మంది తరలి వెళ్లారని, తిరిగి వారిని ఇక్కడకు రప్పిస్తామని దినేష్ రెడ్డి చెప్పారు.

English summary

 MIM chief and Hyderabad MP Asaduddin Owaisi has condemned pamphlets against north eastern state peopls in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X