వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్షోభానికి బి-స్కూల్స్‌ను నిందించలేం: సౌమిత్ర దత్తా

By రాజీవ్ గౌడ
|
Google Oneindia TeluguNews

Soumitra Dutta
అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ స్కూళ్లలో ఒక్కటైన కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్‌గా ఇటీవల పదోన్నతి పొందిన సౌమిత్ర దత్తా ఇంటర్వ్యూను వన్ ఇండియా ప్రత్యేకంగా అందిస్తోంది. ఆయనను ప్రముఖ విద్యావేత్త రాజీవ్ గౌడ్ ఇంటర్వ్యూ చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో రాజీవ్ గౌడ్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. విధాన నిర్ణయాలు, విద్య, పాలన వంటి అంశాలపై ఆయనకు అమితాసక్తి. బెంగళూర్‌కు చెందిన ఈయన వార్టన్ అండ్ బెర్కలీ పూర్వ విద్యార్థి.

భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, అందుకు మీరందిస్తున్న సాయం ఏమిటి, దాంతో పాటు మీ మీరు ప్రగతికి సంబంధించిన అనుభవాలను, ఆలోచనలను, తదితర విషయాలను చెబుతారా?

మా తండ్రి వైద్యులు. భారత వైమానిక బలగాల్లో పనిచేశారు. మా తల్లి హౌస్‌వైఫ్. తన జీవితాన్ని కుటుంబం కోసమే అంకితం చేసింది. వైమానిక బలగాల సమూహంలో పెరుగుతూ నేను దేశంలోని ఢిల్లీ, జోర్హాట్, బెంగళూర్ వంటి పలు ప్రదేశాల్లో తిరిగాను. దేశంలోని పలు ప్రాంతాల్లో మిత్రులు లభించారు. దాంతో నా డిఎన్ఎలోనే బహుళ సంస్కృతి, విభిన్నత చోటు చేసుకున్నాయి. ఇది పలు దేశాల్లో, సంస్కృతుల్లో జీవిస్తూ అంతర్జాతీయ స్థాయిలో విద్యలో ప్రగతి సాధించడానికి తోడ్పడింది. మా అణ్మ ప్రభావం నాకు ఎంతో సహాయం చేసింది. నాయకత్వం స్థాయికి అవసరమైన మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం, ప్రాథమిక విలువలను సంతరించుకోవడం అక్కడి నుంచే అబ్బింది.

కొన్ని దశాబ్దాలుగా ఇండియాకు దూరంగా ఉన్నారు. ఇండియాతో సంబంధాలను ఎలా నిలుపుకోగలిగారు?

ప్రతి రెండు, మూడు నెలలకు ఒక్కసారి ఇండియా వస్తుంటాను. మా తల్లిదండ్రులు, సోదరి ఢిల్లీలో ఉంటారు. దేశంలో నాకు చాలా మంది మిత్రులున్నారు. సిఐఐ వంటి సంస్థలతో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలతో నేను నిరంతరం పనిచేస్తుంటాను. నేను ఇండియాను ప్రేమిస్తాను, నేను భారతీయుడిని. నేను భారతదేశాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు.

ఐరోపాతో పోలిస్తే అమెరికాలో సంప్రదాయంగానే స్థానికేతరుల ప్రతిభను (హార్వర్డ్, కెల్లాగ్, ఇప్పుడు కార్నెల్ బిజినెస్ స్కూల్స్ వంటివి) ప్రోత్సహిస్తున్నాయి. ఐరోపా బిజినెస్ సర్కిల్ టాప్ ర్యాంకులోకి వెళ్లే క్రమంలో మీ అనుభవాలు ఏమిటి?

చాలా ప్రపంచ సంస్థల్లకన్నా మించి ఇన్‌సెడ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇన్‌సెడ్ లేదా ఇతర ఐరోపా స్కూల్స్ స్థానికేతరుల ప్రతిభను స్వాగతించవనే భావన నాకు లేదు. అయితే ఐరోపా స్కూల్స్ గ్లోబల్ ఫ్యాకల్టీని ఆకర్షించే విషయంలో తక్కువగా పోటీ పడుతుంటాయనేది నిజం. ఇన్‌సెడ్ మాదిరిగా కాకుండా స్టేట్ స్కూల్స్‌గానే ఉన్నాయి. దీనికి కారణం - గ్లోబల్ టాలెంట్‌ను పొందడానికి తగిన ఆర్థిక ప్యాకేజీలు లేకపోవడం. పలు ఐరోపా స్కూళ్ల చిత్రం మారుతోంది. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ - రెండింటి పరంగా గ్లోబల్ టాలెంట్‌ విషయంలో పోటీ పడడానికి సమాయత్తమయ్యాయి. జాన్సన్ స్కూల్ డీన్ హోదాను అప్పగించే విషయంలో అమెరికా సరిహద్దులు దాటి నిర్ణయం తీసుకోవడమే కార్నెల్ విశ్వవిద్యాలయం దేశ సరిహద్దులు దాటి ఆలోచిస్తోందనడానికి నిదర్శనం. టాప్ యూనివర్శిటీలు గ్లోబలైజేషన్‌ను భవిష్యత్తుకు ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి. జాన్సన్‌ను ప్రపంచానికి ఇవ్వడం, ప్రపంచాన్ని జాన్సన్‌కు ఇవ్వడం నా ప్రాథమిక లక్ష్యం. ఫ్యాకల్టీ, స్టాఫ్, స్టూడెంట్స్‌తో జరిగే చర్చల్లో ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలనే విషయాన్ని నిర్ణయించుకుంటా.

ఇన్‌సెయిడ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌ను నడపడంలోని మీ అనుభవంతో కార్నెల్ కార్పోరేట్ యూరోప్‌ను బ్రేక్ చేయాలని అనుకుంటోందా? యూరోజోన్ సంక్షోభం దృష్ట్యా అటువంటి ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదా?

కార్నెల్ తప్పకుండా ఐరోపా మీద, ఇతర ప్రారంభ మార్కెట్ల మీద దృష్టి పెడుతుంది. ప్రస్తుత వాణిజ్య వ్యూహం గ్లోబల్. సీరియస్ కంపెనీ ఏదీ బిజినెస్‌ను పూర్తిగా జాతీయ లేదా ప్రాంతీయ ప్రాతిపదికపై చేయలేదు. యూరోజోన్ ఆర్థిక సంక్షోభం వంటి సంక్షోభాలు తాత్కాలికమైనవి. బిజినెస్ ఎడ్యుకేషన్‌, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్‌లో విశ్వదృక్పథానికి దీర్షకాలిక అవసరాలకు అవి ఆటంకం కాబోవు.

2008 సంక్షోభాన్ని తీసుకుంటే, ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లున్న బిజినెస్ స్కూల్స్ ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. 2008 పునరావృతం కాకుండా ఎంబిఎ ప్రోగ్రామ్స్‌ను ఎలా ఫిక్స్ చేస్తారు?

2008 సంక్షోభానికి బిజినెస్ స్కూల్స్‌పై నింద వేయలేం. కొద్ది మంది మాత్రమే సంక్షోభాన్ని సృష్టించడంలో పాత్ర వహించారు. ఎంబిఎ ప్రాగ్రామ్స్‌ను అందించడంపై సంక్షోభం ఏ విధమైన ప్రభావం చూపుతుందనేది అడగాల్సిన ప్రశ్న. అడ్డదారులుండవు. కొన్ని ముఖ్యమైన విషయాలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎ) సంకుచిత ఫర్మ్ స్థాయి దృక్కోణాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలని, సమాజాన్ని పరిగణనలోకి తీసుకుంటూ బిజినెస్ సిస్టమ్స్ సంపూర్ణ దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బి) నమూనాలపై, పరిష్కారాలపై మాత్రమే దృష్టి పెట్టకూడదు, రిస్క్‌ను, సరిబద్దు స్థితిగతులను కూడా గమనంలోకి తీసుకోవాలి. నమూనాలు, అంచానలు విఫలమైనప్పుడు చాలా నేర్చుకోవాలి. సి) ప్రతి ఒక్కరి మంచి కోసం బిజినెస్‌ను ఓ శక్తిగా చూసే ఎథికల్ నాయకత్వం మౌలిక విలుపలను పటిష్టం చేయాలి.

పనిని, జీవితాన్ని ఆన్‌లైన్ ప్రపంచం ఎలా మారుస్తుందనే విషయంపై మీరు అద్భుతమైన కృషి చేశారు. విద్యకు సంబంధించిన భిన్నమైన విధానాలను మార్చడానికి ఆ ఆలోచనలను అమలులో పెడతారా?

మన చుట్టుపక్కల ప్రపంచాన్ని టెక్నాలజీ మారుస్తోంది. బోధనను అందించడంలో, విద్యలో కొత్త వాణిజ్య నమూనాలను సృష్టించడంలో విశేషమైన ప్రభావం చూపుతోంది. కార్నెల్‌లో కంప్యూటర్, ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌కు సంబంధించి బలమైన డిపార్ట్‌మెంట్ ఉంది. జాన్సన్ స్కూల్ పరిశోధన, ప్రోగ్రామ్ కార్యకలాపాల్లో టెక్నాలజీని ఎంత బాగా వాడుకుంటామనే విషయంపై వారితో కలిసి పనిచేస్తాను.

యాజమాన్య ఆలోచనా సరళి, ఆచరణలపై ప్రభావం చూపబోయే బిజినెస్ ఐడియాలుా ఏమిటని మీరు అనుకుంటున్నారు?

మంచి కోసం బిజినెస్ ఇవాళ్ల ఓ శక్తిగా మారింది. కాపిటలిస్టిక్ యజమానుల అవసరాలు మాత్రమే కాకుండా కీలకమైన స్టేక్ హోల్డర్ల్ అవసరాలను కూడా అది తీరుస్తోంది. కొద్ది పాటి అవసరాలను మాత్రమే కాకుండా (తక్షణ వినియోగదారులు, స్థానిక స్టేక్ హోల్డర్ల అవసరాలకు మాత్రమే కాకుండా) సమ్రథమైన విశ్వ పౌరుల అవసరాలను తీర్చే దిశగా వ్యాపించాలి. సమర్థమైన మేనేజ్‌మెంట్ ఎజెండాగా ఈ ఆలోచనలను సమీకృతం చేయడానికి వచ్చే బడా బిజినెస్ థీయరీలు మార్గాలు చూపాలి. నిలకడైన పెరుగుదల కోసం బిజినెస్ సమర్థతను అది కలుపుతుంది.

టాప్‌లో ఉండడానికి ఆవిష్కరణలపై మీరు ఓ పుస్తకం రాశారు. ఇప్పుడు మీరు టాప్‌లో ఉన్నారు. మా కోసం మీ వద్ద ఇంకా ఉన్నటువంటి ఆవిష్కరణలు ఏమిటి?

లీడర్‌షిప్ సర్వీస్ పొజిషన్. నిజానికి నేను టాప్‌లో ఉన్నానని అనుకోవడం లేదు. అవును, నేను స్కూల్ డీన్‌గా నామినేటయ్యాను. నా లక్ష్యాన్ని సాధించడానికి నేను ఫ్యాకల్టీ, సిబ్బంది, అల్యుమినా వంటి స్టేక్ హోల్డర్లతో మాట్లాడాల్సి ఉంటుంది, వారి ఆలోచనలను కామన్ యాక్షన్ ఎజెండాగా మార్చాలి ఉంటుంది. వారి ఆలోచనలు అమలు కావడానికి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. కార్నెల్, జాన్సన్ స్కూల్ పలు మార్గాల్లో నూత్నంగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఎమర్జెంగ్ మార్కెట్లు, టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నిలకడైన ఎంటర్‌ప్రైజెస్ దిశగా వినూత్నమైన ఎజెండాలను సాగించాలని అనుకుంటున్నాను.

English summary
OneIndia brings to you an exclusive interview with Soumitra Dutta, who was recently elevated to the enviable position as Dean of Cornell Johnson Graduate School of Management as the First Major U.S. Business School Dean appointed from an International Academic Institution. The interviewer is a notable personality in his own right and is Rajeev Gowda, an Indian Institute of Management professor who is passionate about subjects like policy making, education and governance. This Bengalurean himself is an alumni of Wharton and Berkeley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X