వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ టెండూల్కర్ స్థాయి తగ్గుతోందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థాయి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ టెండూల్కర్ అటు టెస్టుల్లో రాణించలేదు, ఇటు వన్డేల్లో రాణించడం లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో అతను చేసిన పరుగులు చూస్తే దిమ్మ తిరుగుతుంది. సచిన్ టెండూల్కరేనా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టు మ్యాచుల్లో బాగా రాణించారు. కానీ వన్డేల్లో విఫలమవుతున్నాడు. ఈ స్థితిలో రికీ పాంటింగ్‌ను వన్డే సిరీస్ నుంచి వెంటనే తప్పించారు. పరిస్థితిని గుర్తించిన పాంటింగ్ - తాను వన్డేలకు స్వస్థి చెబుతున్నట్లు ప్రకటించాడు. రికీ పాంటింగ్‌తో పోలిస్తే టెండూల్కర్ ఆట తీరు అంత బాగా ఏమీ లేదు, అంతకన్నా దారుణంగానే ఉంది. అయినా టెండూల్కర్ జట్టులో కొనసాగుతున్నాడు. పైగా, మైదానంలోకి దిగే అవకాశాలను కొల్లగొడుతున్నాడు. ఈ స్థితిలో అత్యంత మర్యాదస్థుడైన సచిన్ టెండూల్కర్ చేయాల్సిందేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ప్రపంచ కప్ పోటీల తర్వాత టెండూల్కర్ తప్పుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. వన్డేల్లోంచి సచిన్ తప్పుకోవాల్సిందని మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా సూచించాడు. మైలురాయిని చేరుకోవాలనే విషయాన్ని మనసు నుంచి తొలగించుకోవాలని కాస్తా మర్యాదగా రవిశాస్త్రి టెండూల్కర్‌కు సూచించారు. చాలా మంది మాజీ క్రికెటర్లు - టెండూల్కర్ విషయంలో తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు.

ఆ మాటలను గానీ, వారి వాదనలను గానీ సచిన్ టెండూల్కర్ పట్టించుకోకుండా టెండూల్కర్ జట్టులో కొనసాగుతూనే ఉన్నారు. ఇలా కొనసాగడం వెనక బిజినెస్ లాబీ ఏమైనా ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా, సచిన్ టెండూల్కర్ తన ప్రతిష్టను తగ్గించుకునే విధంగానే వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయం మాత్రం రోజురోజుకూ బలపడుతోంది.

English summary
Debate is going on sachin Tendulkar performance and his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X