వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువ: విద్యార్థులు తక్కువ

By Pratap
|
Google Oneindia TeluguNews

Engineering Students
హైదరాబాద్: రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థులు లేక సతమతమవుతున్నాయి. కొన్ని కళాశాలల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కన్వీనర్ కోటా సీట్లకు తొలి దశ కౌన్సెలింగ్ జరిగింది. ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కలిపి మొత్తం 2,34,765 సీట్లు అందుబాటులో ఉండగా 1,34,373 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 1,00,392 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్ల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థుల్లో 2,150 మందికి సీటు రాలేదు.

అలాగే సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్న వారిలో 533 మంది ఆప్షన్లు ఇవ్వలేదు. సీట్ల కేటాయింపు సమాచారాన్ని అభ్యర్థులందరికీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకే ఎస్ఎంఎస్ ద్వారా అధికారులు తెలియజేశారు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీలో ఈ నెల 20లోగా అడ్మిషన్ పొందాలి. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు 22లోగా తమ సీటును రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లతో పాటు, సీట్ల రద్దు గడువు ముగిసిన తర్వాత ఖాళీగా ఉండే మొత్తం సీట్లకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

ఈ నెల 26 నుంచి 29 వరకు దీన్ని నిర్వహిస్తారు. తొలి దశలో అడ్మిషన్ పొందిన వారు, రద్దు చేసుకున్న వారు, సీటు రాని వారు, ఇప్పటివరకు సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోని అభ్యర్థులు సైతం రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. తొలి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటును రద్దు చేసుకోకుండా రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు రెండో దశలో వచ్చిన సీటే మిగులుతుంది. ఈసారి ఫార్మసీ కోర్సులో సీట్ల కేటాయింపు పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీ(9), ప్రైవేటు ఫార్మసీ కాలేజీ(248)ల్లో కలిపి మొత్తం 7,932 సీట్లు అందుబాటులో ఉండగా 634 సీట్లే భర్తీ అయ్యాయి.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, సాంఘిక సంక్షేమశాఖ స్పాన్సర్ చేసి ప్రైవేట్ కాలేజీల్లో చదివించిన అభ్యర్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందని ఎంసెట్ అడ్మిషన్స్ కమిటీ కన్వీనర్ అజయ్‌జైన్ తెలిపారు. ఆయా అభ్యర్థులు హెల్ఫ్‌లైన్ సెంటర్‌కు వెళ్లి రివైజ్డ్ అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకుని సంబంధిత కాలేజీలకు వెళ్లాలని సూచించారు. ఈ మేరకు అన్ని కాలేజీలకూ సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. ఆరు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదని ఆయన చెప్పారు. 114 కాలేజీల్లో అన్ని సీట్లు భర్తీ అయినట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ అధికారి కె.రఘునాథ్ తెలిపారు.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీలకు అభ్యర్థులు ఆప్షన్ల వరద పారించగా.. కొన్నింటిలో సీట్ల భర్తీకి అసలు ఆప్షన్లే నమోదు కాలేదు. దాంతో ఆరు కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాకపోగా.. 20 కళాశాలల్లో పదిలోపు మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. వాటి వివరాలు...

- ఒక్క సీటూ భర్తీ కాని కాలేజీలు... అడుసుమిల్లి విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చి సెంటర్ (బొమ్మల రామారం), గోకుల్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (బొబ్బిలి), లుంబిని గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (భువనగిరి), మ్యాట్రిక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (చీకటి మామిడి), శ్రీ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ (కావలి), టీఆర్‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అలంపూర్ క్రాస్‌రోడ్).

- ఒక్క సీటు మాత్రమే భర్తీ అయినవి... శ్రీరాములు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (తణుకు), విష్ణుశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బొమ్మల రామారం).

- రెండు సీటు భర్తీ అయిన కాలేజీలు... ఏఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (కాకినాడ), శేషాచల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (తిరుపతి), వైష్టవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్(తిరుపతి).

- అక్షయ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిద్ధవటం), వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీ (ఖమ్మం), యూనిస్ సుల్తాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (చేవెళ్ల) కళాశాలల్లో నాలుగు సీట్లు భర్తీ అయ్యాయి.

- ఐదు సీటు భర్తీ అయిన కాలేజీలు... జోగయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (పాలకొల్లు), మాంటెస్సోరి శివ శివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (మైలవరం), శ్రీ నాగోజీరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (మహబూబ్‌నగర్).

- ఇక.. శ్రీ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అనంతపూర్), సుప్రజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ (స్టేషన్‌ఘన్‌పూర్) కళాశాలల్లో ఆరేసి సీట్లు... ఆచార్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (బద్వేల్), మూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కీసర)ల్లో ఏడు సీట్లు... నైటింగేల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (విశాఖపట్నం), నిమ్రా ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (జూపూడి), సుజల భారతీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్)ల్లో 8 సీట్ల చొప్పున మాత్రమే భర్తీ అయ్యాయి.

English summary
Engineering colleges are suffering from lack of students. First stage counseling has been completed to fill up engineering seats. No body has come out take seats in six colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X