వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీలం తర్వాత మహాసేన్: తుఫాన్లకి ఆ పేర్లెందుకు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

మన దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, శ్రీలంకను ఇటీవల నీలం తుఫాను ఓ కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ఈ తుఫానుకు నీలం అని పాకిస్తాన్ పేరు పెట్టింది. హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఎనిమిది దేశాలు తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి.

How and why Cyclones are given names like Nilam, Mala, Rashmi, Nargis, Bijli, Laila

భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండులు వరుసగా తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి. ఇందులో భాగంగా ఈసారి తమిళనాడు, ఎపి, శ్రీలంకలను కుదేపిసిన సైక్లోన్‌కు పాకిస్తాన్ పేరు పెట్టింది. తుపాన్‌లకు పేర్లు పెట్టడం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది.

అయితే హిందూమహా సముద్రంలో వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టేందుకు ఒక విధానాన్ని ఆయా దేశాలు 2004లో రూపొందించాయి. ఈ విధానమే ప్రస్తుతం అమలులో ఉంది. నీలం తుఫాను కుదిపేయగా.. భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు కూడా ఆయా దేశాలు పేర్లు నిర్ణయించాయి.

తర్వాత వచ్చే తుఫానుకు శ్రీలంక మహాసేన్ అని పేరు పెట్టగా, ఆ తర్వాత దానికి థాయ్‌లాండ్ పైలిన్ అని పేరు పెట్టింది. భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు మన దేశం తరఫున కూడా అప్పుడే పలు పేర్లు క్యూలో ఉన్నాయి. లెహర్, మేఘ్, సాగర్, వాయులు ఉన్నాయి.

అలాగే పాకిస్తాన్ పెట్టిన పేర్లలో నీలోఫర్, టిట్లి, బుల్ బుల్ ఉన్నాయి. నీలం తుఫాన్ కంటే ముందు వచ్చిన తుఫాన్‌కు ముర్జాన్ అని ఓమన్ దేశం పెట్టింది. 2004 నుండి వచ్చిన పలు సైక్లోన్‌లకు మన దేశం పెట్టిన పేర్లు... అగ్ని, ఆకాశ్, బిజ్లి, జల్ ఇలా ఉన్నాయి. వచ్చే తుఫానుకు శ్రీలంక మహాసేన్‌గా నామకరణం చేసింది.

సైక్లోన్‌లకు పేర్లు ఎందుకు?

సైక్లోన్‌లకు నీలమ్, అగ్ని, ఆకాశ్ అని ఇలా పేర్లు ఎందుకు పెడతారనే ప్రశ్న పలువురిలో ఉదయించవచ్చు. సైక్లోన్‌కు టెక్నికల్ కోడ్‌నో లేక ఓ నెంబర్‌నో ఇవ్వడం కంటే ఇలా ప్రజల్లోకి వెళ్లే పేర్లు పెట్టడం వీజీ. తుఫాన్ అనేది బీభత్సాన్ని సృష్టిస్తుంది. అందుకే ప్రజల్లోకి వీజీగా వెళ్లే పేరు పెడితే వారిని అప్రమత్తం చేసేందుకు వీలుగా ఉంటుంది.

అలాగే ఇలా పేర్లు పెట్టడం వల్ల ఒక పర్యాయం వచ్చిన తుఫాను గురించి తెలుసుకునేందుకు ఆ పేరుతో పరిశీలిస్తే దాని వల్ల వచ్చిన లాభనష్టాల గురించి కూడా సులభంగా తెలుసుకోవచ్చ. నెంబర్ ఇవ్వడమో టెక్నికల్ కోడ్ ఇవ్వడమో చేస్తే సులభంగా ఉండదు. ఈ పేర్లు పెట్టడం కూడా ప్రపంచ వాతావరణ సంస్థ నియమావళికి లోబడే ఉంటుంది.

English summary
Mala, Rashmi, Nargis, Bijli, Laila and now Nilam. These are not names of actresses from the silver screen, but names of tropical cyclones that have occurred over North Indian Ocean in recent years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X