వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్య సంపన్నుడు నిజాం కింగ్: వరల్డ్‌లో టాప్ 6

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osman Ali Khan
భారత దేశానికి సంబంధించి నిజాం ఆఖరి నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ఇప్పటి వరకు అత్యంత సంపన్న వ్యక్తి. అంతేకాదు 1967లో మృతి చెందిన అలీఖాన్ ఈ భూమ్మీద ఇప్పటి వరకు నివసించిన మొదటి పది మంది అత్యంత సంపన్నుల్లో ఆరో వ్యక్తి. ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం రాజ్యానికి ఆఖరి రాజు. సెలబ్రిటీ నెట్ వర్త్ వెబ్‌సైట్ ఈ భూమ్మీద ఇప్పటి వరకు జీవించిన అత్యంత ధనవంతుల జాబితాను రూపొందించింది. దీనిని ద ఇండిపెండెంట్ ప్రచురించింది.

సుమారు వెయ్యేళ్ల లెక్కలను తీసుకున్నా అంతకుముందు అంత సంపన్నులు ఎవరూ లేరని ఆ వెబ్ సైట్ పేర్కొంది. అందుకే చరిత్రలో అత్యంత సంపన్నుల జాబితా తాము రూపొందించిందే అయి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు భూమ్మీద జీవించిన తొలి పది మందిలో ఉస్మాన్ అలీ ఖాన్ ఆరో వ్యక్తి. భారత దేశంలో మొదటి వాడు. పదిమంది టాప్ వరల్డ్ ధనవంతుల జాబితాలో అలీ ఖాన్ మినహా భారత్‌కు చెందిన ఎవరూ లేరు. ఆయన ఆస్తుల విలువ రూ.11,80,000 కోట్లు.

ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా 14 శతాబ్దంలో మాలిని పరిపాలించిన మన్సా మూసా-1 అనే రాజు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.20,00,000 కోట్లు అని సదరు వెబ్ సైట్ తేలిపింది. ఈ వెబ్ సైట్ మొత్తం 24 మందిని అత్యంత సంపన్నులుగా గుర్తించింది. రెండో స్థానంలో రోథ్ చైల్డ్స్ కుటుంబం నిలిచింది. పద్దెనిమిదో శతాబ్దంలో రోథ్ చైల్డ్ రూ.17,50,000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడని పేర్కొంది.

ఇందులో మహిళలకు ఎవరికీ చోటు దక్కలేదు. ఆ ఇరవై నాలుగు మందిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యంత ధనికుడిగా కార్లోస్ స్లిమ్ ఉన్నారు. ఆయన ఈ జాబితాలో 23వ స్థానంలో ఉండగా.. అత్యంత ధనికుడిగా పేరుగాంచిన వారెన్ బఫెట్ 24వ స్థానంలో ఉన్నారు.

English summary
When you think of India's all-time richest people, what are the names that cross your mind? No, it's not the Tatas, Birlas or Ambanis, it's Osman Ali Khan, the last Nizam (or ruler) of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X