వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండూల్కర్‌పై పాంటింగ్‌కు అసూయనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ricky Ponting-Sachin Tendulkar
ముంబై: రికార్డులు బద్దలు కొట్టే విషయంలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భయం మాత్రం ఉంటూ వచ్చింది. సమకాలీన అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లు. లారా ఇది వరకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. పాంటింగ్ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ఇక టెండూల్కర్ రికార్డులను పాంటింగ్ బద్దలు కొట్టే అవకాశం లేదు.

పాంటింగ్ కూడా టెండూల్కర్ రికార్డులకు అన్నింటికీ పోటీకి రాలేని స్థాయిలోనే ఉన్నాడు. కొన్ని రికార్డుల విషయంలోనే ఆ పోటీ కొనసాగిస్తూ వచ్చాడు. పాంటింగ్ తన వీడ్కోలు మీడియా ప్రతినిధుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు టెండూల్కర్‌పై ఆయనకు ఏమైనా అసూయ ఉందా అనే అనుమానాలను రెకెత్తిస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ ది బెస్ట్ అంటూనే బ్రియాన్ లారాను అతను నెత్తికెత్తుకున్నాడు. టెండూల్కర్ కన్నా లారాదే పైచేయి అని అతను అన్నాడు.

లారా ఒంటి చేతి మీద మ్యాచును తన దేశానికి గెలిపించి పెట్టేవాడని, అతను క్రీజులో ఉంటే తనకు నిద్ర పట్దేది కాదని పాంటింగ్ అన్నాడు. టెండూల్కర్ అలా కాదని చెప్పకనే చెప్పాడు. సచిన్ ఎన్ని వ్యక్తిగత రికార్డులు సాధించినప్పటికీ మ్యాచ్‌ను ఒంటి చేతి మీద గెలిపించిన సందర్భాలు లేవనేది అతని భావన. టెండూల్కర్‌పై అసూయతోనే పాంటింగ్ ఆ వ్యాఖ్యలు చేశాడని అనుకోవడానికి వీలుంది. కానీ, అతని మాటల్లో నిజం కూడా ఉంది.

టెండూల్కర్ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతాడనే విమర్శ చాలా కాలంగా ఉంది. అతను జట్టును ఒంటి చేతి మీద నిలబెట్టిన సందర్భాలు చాలా తక్కువే. అది ఎంత దాకా వెళ్లిందంటే, టెండూల్కర్ బాగా ఆడి సెంచరీ చేస్తే భారత్ ఒడిపోతుందని భావించే దాకా వెళ్లింది. టెండూల్కర్ భారత్‌ను గట్టెక్కించిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పాలి. ఆ మాటకొస్తే, రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ అలా జట్టును గట్టెక్కించిన సందర్బాలున్నాయి. ఓడిపోయే మ్యాచులను వారు గెలుపువైపు తిప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై వివియస్ లక్ష్మణ్ ఆడిన ఆట ఎప్పటికీ మరిచిపోలేనిదే. అలాంటి అద్భుతమైన సంఘటనలు టెండూల్కర్ విషయంలో లేవనే చెప్పాలి. అందుకే కంగారూలు లక్ష్మణ్‌కు భయపడినంతగా టెండూల్కర్‌కు భయపడినట్లు కనిపించరు. ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఓ దూకుడు స్వభావం ఉంటుంది. ఆ స్వభావం ఉమ్మడిగా జట్టును గెలిపించడమనేది. భారత్‌కు ఉమ్మడిగా లక్ష్యాన్ని సాధించే సందర్భాలు లేవు. ఒత్తిడికి గురైనప్పుడు బాగా ఆడడమనే అలవాటు బాగా ఉంది. వికెట్లను భారత బ్యాట్స్‌మెన్ జారవిడుచుకునే సందర్భాలను కొన్నింటిని పరిశీలిస్తే ఇంత బాధ్యతారహితంగా అడుతారా అనిపించకమానదు. దీనికి టెండూల్కర్ అతీతుడేమీ కాదనిపించడమే పెద్ద లోటు. ఇందులో భాగంగానే పాంటింగ్ వ్యాఖ్య వచ్చిందని అనుకోవాలి.

English summary
"I probably lost more sleep on the eve of games against (Brian) Lara because I knew he could single-handedly win games. The way I judge players has always been on their ability to win games by themselves. Lara could certainly do that and he did it probably more than what Sachin's done for India", Ricky Ponting said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X