వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంబలకిడి పంబ: 13 ఏళ్ల తర్వాత అమ్మాయిగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manjula's Jambalakidi Pamba
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అబ్బాయి పదమూడేళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయి ఇప్పుడు అబ్బాయిగా తిరిగి వచ్చాడు. జిల్లాకు చెందిన ఉండి మండలం కలిసిపూడికి చెందిన ఓ అబ్బాయి తన పదకొండేళ్ల వయసులో తన సొంత ఊరును, కన్నవారిని విడిచి వెళ్లాడు. ఇప్పుడు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తిరిగి సొంత గ్రామానికి వచ్చాడు. అతను తన తల్లి మీద ప్రేమతో తిరిగి వచ్చాడు.

అయితే ఇప్పుడు ఆ 'అతడు' ఆమెగా మారాడు. బాలుడిగా వెళ్లిన ఆ పదకొండేళ్ల అబ్బాయి అమ్మాయిగా తిరిగి వచ్చాడు. అమ్మాయిలా కనిపించాలనే కోరికతో పదమూడేళ్ల క్రితం అందరినీ వదిలి ముంబయికి వెళ్లాడు. ప్రస్తుతం తిరిగి వచ్చి తన పేరును మంజులగా మార్చుకుంది. అబ్బాయిగా ఉన్నప్పటి పేరును చెప్పుకోవడానికి మంజుల ఇష్టపడక పేరును మార్చుకుంది.

చూడ చక్కని రూపంతో వచ్చిన ఆమెను చూసిన గ్రామస్తులు అప్పుడు వెళ్లి పోయింది ఇప్పుడు వచ్చింది ఒక్కరేనా అని ఆశ్చర్యపోతున్నారు. భీమవరంలో ఆరో తరగతి వరకు చదివిన మంజుల 1999లో ఇంటి నుండి వెళ్లి పోయింది. హిజ్రాలు ఉండే ప్రాంతానికి చేరుకుంది. పదమూడవ ఏట అమ్మాయిగా మారేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకుంది.

తాను పూర్తిగా అమ్మాయిగా మారేందుకు నాలుగేళ్లు పట్టిందట. ముంబయిలోనే స్థిరపడినప్పటికీ కన్న వారిపై మమకారంతో ఇక్కడికి వచ్చిందట. మంజులను చూసిన పలువురు ఇరవయ్యేళ్ల క్రితం చూసిన జంబలకిడి పంబ సినిమాను గుర్తుకు తెచ్చుకుంటున్నారట.

English summary
A boy, who is ran out from village in East Godavari district at her age 11 was returned with name Manjula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X