వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఐసి నుంచి మరో పథకం 'జీవన్ దీప్'

By Pratap
|
Google Oneindia TeluguNews

LIC
న్యూఢిల్లీ: భారతీయ జీవిత భీమా నుంచి మరో కొత్త పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కొత్త సూక్ష్మ భీమా పథకం జీవన్ దీప్‌నకు ఎల్ఐసి శనివారం శ్రీకారం చుట్టింది. ఓ రోజుతో భారతీయ జీవిత భీమాకు 56 ఏళ్లు వచ్చాయి. ప్రజల డబ్బులను ప్రజల సంక్షేమానికి వాడాలని, నిధులను ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు ఉపయోగించాలని ఎల్ఐసి లక్ష్యాలు.

జీవన్ దీప్ ఆన్ - లైన్ బై ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. ఎల్ఐసి 2011 - 12లో 357 పాలసీలను విక్రయించింది. ఇది జారీ చేసిన కొత్త పాలసీల మార్కెట్‌లో 80.9 శాతం. ఇది తొలి ఏడాది ప్రీమియం ఆదాయంాన్ని 81514.49 కోట్లకు పెంచింది. పింఛను, గ్రూప్ ఇన్సూరెన్స్‌ ద్వారా వచ్చిన 38955.06 కోట్ల ప్రీమీయం కూడా ఉంది. ఇది మార్కెట్ వాటాలో 71.36 శాతం. సంప్రదాయబద్దమైన వ్యాపారంలో పింఛను, గ్రూప్ స్కీమ్‌ల్లో 284.12 లక్షల కొత్త లైవ్‌ల బీమా జరిగింది. సామాజిక భద్రతా పథకాల కింద 94.44 లక్షల లైవ్‌ల బీమా జరిగింది.

2011 - 12లో 66022.82 కోట్ల రూపాయల విలువ చేసే 185.7 లక్షల క్లెయిమ్స్‌ను సెటిల్ చేశారు. మాచ్యురిటీపై, మాచ్యురిటీకి ముందు 93.19 శాతం మాచ్యురిటీ క్లెయిమ్‌లను సెటిల్ చేశారు. కేవలం 15 రోజుల ముందు సమాచారంతో 94.34 శాతం నాన్ ఎర్లీ డెత్ క్లెయిమ్స్‌ను సెటిల్ చేసినట్లు ఎల్ఐసి ఓ ప్రకటనలో తెలిపింది. అవుట్ స్టాండింగ్ మాచ్యురిటీ క్లెయిమ్స్ నిష్పత్తి కేవలం 0.5 శాతం మాత్రమే ఉంది. అదే విధంగా అవుట్ స్టాండింగ్ డెత్ క్లెయిమ్ నిష్పత్తి 1.22 శాతం ఉంది. పాలసీ హోల్డర్ల మొత్తం చెల్లింపులు రూ.112,911.82 కోట్లకు చేరుకున్నాయి.

వివిధ గ్రూపులకు ఎల్ఐసి గ్రూప్ పాలసీల కింద జీవిత భీమాను అందుబాటులోకి తెచ్చింది. జనశ్రీ భీమా యోజన, ఆమ్ ఆద్మీ భీమా యోజన వంటి సామాజిక భద్రతా గ్రూప్ పథకాల కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉనన ప్రజలకు కూడా భీమాను ఎల్ఐసి అమలు చేస్తోంది. జనశ్రీ బీమా యోజన కింద పాలసీ తీసుకున్న సభ్యుల పిల్లలకు ఎల్ఐసి శిక్షా సహయోగ్ యోజన అనే ఫ్రీ యాడ్ ఆన్ స్కాలర్‌షిప్ లబ్ధిని అమలు చేస్తోంది. ఆమ్ ఆద్మీ భీమా యోజన కింది సభ్యులకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంది.

ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా ఎల్ఐసి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్జీవోలకు చెందిన 211 ప్రాజెక్టులకు సహకారం అందిస్తోంది. మౌలిక సదుపాయాల మద్దతు ద్వారా సామాజిక సేవకు మొదటి నుంచి ఎల్ఐసి దీన్ని అమలు చేస్తోంది.

తమ సేవలకు గాను ఎల్ఐసి భీమా కెటగిరీ కింద 27 అవార్డులు అందుకుంది. వాటిలో ముఖ్యమైనవి రీడర్స్ డైజెస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డు, బిజినెస్ సూపర్ బ్రాండ్స్, సిఎన్‌బిసి ఆవాజ్ కన్జ్యూమర్స్ ట్రస్టెడ్ చాయిస్ అవార్డు, ఈటి బ్రాండ్ ఈక్విటీ అవార్డు, గోల్డెన్ పీకాక్ - ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అవార్డు, అవుట్‌లుక్ మనీ అవార్డు, సిఎన్‌బిసి టీవి18 అవార్డు.

English summary
A new micro insurance product Jeevan Deep is being launched 1st September by Life Insurance of India (LIC). LIC turns 56 on 1st September 2012. Jeevan Deep is an endowment assurance with an added feature of guaranteed additions along with provision of Loyalty addition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X