వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ధోనీది అదృష్టమే... కెప్టెన్‌గా కోహ్లీయే బెస్ట్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni-Virat kohli
ఇంగ్లాండు చేతిలో భారత్ ఘోర పరాజయం పాలు కావడంతో భారత జట్టు క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీని సాగనంపాలని అతని స్థానంలో విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పజెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండు, ఆస్ట్రేలియాల్లో వైట్ వాష్‌లు ఎదురైనప్పుడే ఈ విమర్శలు వినిపించినా ఇప్పుడు సొంత గడ్డ పైనే దారుణ పరాజయాన్ని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు.

సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ తదితర సీనియర్లు ధోనిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్‌గా ధోనీ పని అయిపోయిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు ధోనీకి ఏం చేయాలో తెలియడం లేదని, అతనిక టెస్టు కెప్టెన్‌గా పనికి రాడన్నారు. తానైతే అతన్ని ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గానే ఎంపిక చేస్తానన్నారు. కెప్టెన్సీ లేకుంటేనే ధోనీ జట్టుకు ఉపయోగపడతాడన్నారు.

టెస్టు జట్టు నుండి ధోనిని తప్పించి కోహ్లీకి అప్పగించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నాగపూర్ టెస్టు నాలుగో రోజుకు ముందు ధోనికి ప్రత్యామ్నాయం లేదని అన్నానని కానీ క్లిష్ట పరిస్థితుల మధ్య సెంచరీ చేసిన కోహ్లీ నేనున్నానని ముందుకొచ్చాడన్నారు. అతను కెప్టెన్సీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. కెప్టెన్‌గా ధోని విఫలమయ్యాడన్నారు. సిరీస్‌లో ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ బాగా ఆడారని, మన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మాత్రం ప్రభావం చూపలేక పోయరన్నారు.

మరో మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కూడా ధోనీని తప్పించి కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. ధోని ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతుండటం అదృష్టమే అన్నాడు. పటౌడీనో.. సునీల్ గవాస్కరో ఇన్ని టెస్టులు ఓడిపోయి ఉంటే ఇంతకాలం కొనసాగే వారు కాదన్నారు. ప్రపంచ కప్ విజయం తర్వాతనే ధోనీని తప్పించాల్సి ఉండెనన్నారు. ధోనీ చేసిన 99 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకేమైనా ఉపయోగపడిందా అన్నారు. తానైతే కోహ్లీని కెప్టెన్‌గా చేస్తానని చెప్పారు. తెలివైన క్రికెటర్ అని బుర్ర ఉందన్నాడు. మరికొందరి నుండి కూడా కోహ్లీకి పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Former chief selector Krishnamachari Srikkanth on Monday called for Mahendra Singh Dhoni's removal as Test captain, saying he is no more effective as the leader of the side, which suffered a crushing Test series defeat against England.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X