వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ధోనీ సహకరిస్తే లక్ష్మణ్ కథ మరోలా ఉండేది'

By Srinivas
|
Google Oneindia TeluguNews

VV S Laxman
భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అండదండలు ఉంటే సొగసరి బ్యాట్స్‌మెన్ వివిఎస్ లక్ష్మణ్ కథ మరోలా ఉండేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శనివారం అన్నారు. వివిఎస్ లక్ష్మణ్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. లక్ష్మణ్ గుడ్ బై చెప్పగానే పలువురు క్రికెటర్లు స్పందించారు. అయితే గంగూలీ అందరికి భిన్నంగా స్పందించారు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం భారత సెలెక్టర్లకు ఓ బలమైన, స్పష్టమైన హెచ్చరిక అని గంగూలీ అభిప్రాయపడ్డారు.

ధోనీతో ఫోన్‌లో మాట్లాడడం చాలా కష్టమని లక్ష్మణ్ మాటలపై గంగూలీ స్పందించారు. ప్రతీ కెప్టెన్ తన ఆటగాళ్లకు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండాలని కానీ, ధోనీ ఎందుకుండడో తనకర్థం కావడం లేదన్నారు. ధోనీ సహకారం ఉండి ఉంటే లక్ష్మణ్ కథ మరోలా ఉండేదని ఆవేదనగా చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటించి లక్ష్మణ్ మంచి పని చేశాడన్నారు. దీనితో సెలెక్టర్లకు స్పష్టమైన మెసేజ్ పంపాడన్నారు. తాను ఇంకా ఆడుతున్నానని, లక్ష్మణ్‌కు ఐపిఎల్ ఛాన్స్ లేదని అందుకే తన కంటే లక్ష్మణ్ తీసుకున్న నిర్ణయమే కఠినమైనదని దాదా అన్నారు.

లక్ష్మణ్ పైన దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు. అస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మాట్లాడుతూ.. రాహుల్ ద్రావిడ్‌ను ఔట్ చేస్తే గొప్ప అని, సచిన్ టెండుల్కర్‌ను ఔట్ చేస్తే సూపర్ అని, అదే వివిఎస్ లక్ష్మణ్‌ను ఔట్ చేస్తే మాత్రం అద్భుతమే అన్నారు. హైదరాబాదులో ఆడటానికి వస్తున్న తనకు వివిఎస్ లక్ష్మణ్ లేని లోటు పూడ్చలేనిదని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు. లక్ష్మణ్ లాంటి క్రికెటర్ తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారని, లక్ష్య ఛేదనలో ఆరి తేరాడని వెంగ్ సర్కార్ అన్నారు.

English summary
Former India captain Sourav Ganguly on Saturday said that he was surprised to find VVS Laxman state at the press conference that the latter "found it difficult to reach Dhoni."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X