వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదాల్లో తెలుగు చిత్రాలు: రెచ్చగొడుతున్నారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇటీవలి కాలంలో సినిమాలు వరుసగా వివాదంలో చిక్కుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు, బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా ఉందన్న పేరుతో ఏ వుమన్ ఇన్ బ్రాహ్మనిజం, బ్రాహ్మణులను కించపరుస్తే సన్నివేశాలు ఉన్నాయని మంచు విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ... ఇలా తదితర చిత్రాలు ఇటీవల కాలంలో వరుసగా వివాదాల్లో కూరుకుపోతున్నాయి.

వివాదానికి గురైన చిత్రాల్లో పలు చిత్రాలు ఉద్దేశ్య పూర్వకంగా తీసినందు వల్లే వివాదమవుతున్నాయని, కొన్ని చిత్రాలను ఉద్దేశ్య పూర్వకంగా వివాదాల్లోకి లాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తెలంగాణకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉద్దేశ్య పూర్వకంగానే సన్నివేశాలు, డైలాగులు పెట్టారనే విమర్శలు జోరుగా వినిపించాయి.

వివాదాల్లో తెలుగు చిత్రాలు: రెచ్చగొడుతున్నారా?

టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పేర్లతో పాటు ఉద్యమం పట్ల ఉద్దేశ్య పూర్వకంగానే కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో జొప్పించారనే విమర్శలు వచ్చాయి.

వివాదాల్లో తెలుగు చిత్రాలు: రెచ్చగొడుతున్నారా?

భారత దేశం మహిళను గౌరవించే దేశం. అలాంటి మహిళను కించపర్చడమే కాకుండా ప్రత్యేకంగా బ్రాహ్మణ మహిళ అంటూ ఓ సామాజిక వర్గాన్ని కించపర్చడాన్ని బ్రాహ్మణ సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాయి. సినిమాను విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ప్రజా ఒత్తిడికి తలొగ్గవలసి వచ్చింది.

వివాదాల్లో తెలుగు చిత్రాలు: రెచ్చగొడుతున్నారా?

బ్రాహ్మణులు ఆందోళనకు దిగినప్పుడు వారితో సామరస్యంగా చర్చించి సముదాయించే ప్రయత్నాలు చేయకుండా మోహన్ బాబు... వారిని భిక్షగాళ్ల వలె మాట్లాడటం వారిని మరింత కోపోద్రిక్తుల్ని చేసింది. సినిమాలో మనోభావాల అంశాన్ని పక్కన పెడితే మోహన్ బాబు మాటలు రెచ్చగొట్టే విధంగా ఉండకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారి వెనుక కొందరి హస్తం ఉందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

వివాదాల్లో తెలుగు చిత్రాలు: రెచ్చగొడుతున్నారా?

కొసమెరుపు ఏమంటే ఇంతకుముందు కలెక్షన్ల కోసం వివాదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ వివాదాల కారణంగా నిర్మాతలు, బయ్యర్లు ఎంతోకొంతమేర నష్టపోతున్నారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమాని. దీంతో పూరీ కావాలనే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల పేర్లను పోలిన పేర్లు ఉపయోగించారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి దిష్టి బొమ్మలు తగులబెట్టింది. ఇక తెలంగాణకు వ్యతిరకంగా డైలాగులు ఉండటంతో ఆ ప్రాంతంలో ఏకంగా చిత్ర ప్రదర్శనే రెండు మూడు రోజులు నిలిచిపోయింది.

ప్రభుత్వం ఓ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సన్నివేశాలను తొలగించి ..రాంబాబు చిత్రాన్ని తిరిగి తెలంగాణలోని థియేటర్లలో ప్రదర్శించింది. అయినప్పటికీ తెలంగాణవాదులు దానిపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ పేర్ల పోలికలతో పేర్లు పెట్టడం అలాగే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న ఇలాంటి సమయంలో అందుకు సంబంధించి వ్యతిరేకంగా సన్నివేశాలు పెట్టడం ఖచ్చితంగా ఉద్దేశ్య పూర్వకంగానే జరిగాయని అంటుండగా, డైరెక్టర్ నిర్మాత మాత్రం వాటిని కొట్టి పారేశారు. ఏదేమైనా ..రాంబాబు చిత్రం తీవ్ర వివాదాన్నే రేపింది.

అది ముగియగానే ఏ వుమన్ ఇన్ బ్రాహ్మినిజం చిత్రం వివాదాన్ని రగిలించింది. భారత దేశం మహిళను గౌరవించే దేశం. అలాంటి మహిళను కించపర్చడమే కాకుండా ప్రత్యేకంగా బ్రాహ్మణ మహిళ అంటూ ఓ సామాజిక వర్గాన్ని కించపర్చడాన్ని బ్రాహ్మణ సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాయి. సినిమాను విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ప్రజా ఒత్తిడికి తలొగ్గవలసి వచ్చింది.

పలువురి ఆందోళనతో వెనక్కి తగ్గని సదరు సినిమా నిర్మాతలు ప్రభుత్వం సినిమా విడుదలకు నో చెప్పడంతో వెనక్కి తగ్గి వివాదాస్పద సన్నివేశాలు, డైలాగులు తీసివేస్తామని చెప్పారు. ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చిత్రం తీయడాన్ని ఎవరూ హర్షించలేక పోతున్నారు. భారతీయ జనతా పార్టీ నేత ఇంద్ర సేనా రెడ్డి ఈ చిత్రానికి విదేశాల నుండి నిధులు వచ్చాయని, దీనిపై విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతీయతకు ప్రధానమైన బ్రాహ్మణనులపై ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ చిత్రం కూడా వివాదంలో కూరుకుపోయింది. బ్రాహ్మణులపై సెటైర్లు వేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. కేవలం ఈ చిత్రాన్ని మాత్రమే అడ్డుకోవడమేమిటనేది పలువురి ప్రశ్న. ఇందుకు బ్రాహ్మణ వర్గం కూడా ధీటుగానే స్పందించింది. తమను హలీం తినే వారిగా చూపించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను కించపర్చే విధంగా ఉందని బ్రాహ్మణ వర్గాలు ఆందోళన చేస్తున్నప్పుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు వారిని మరింత రెచ్చగొట్టాయని చెబుతున్నారు.

బ్రాహ్మణులు ఆందోళనకు దిగినప్పుడు వారితో సామరస్యంగా చర్చించి సముదాయించే ప్రయత్నాలు చేయకుండా మోహన్ బాబు... వారిని భిక్షగాళ్ల వలె మాట్లాడటం వారిని మరింత కోపోద్రిక్తుల్ని చేసింది. సినిమాలో మనోభావాల అంశాన్ని పక్కన పెడితే మోహన్ బాబు మాటలు రెచ్చగొట్టే విధంగా ఉండకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన వారు అసలైన బ్రాహ్మణులు కారని, చందాల కోసం వచ్చారని, అదేదో అడిగితే ఇచ్చే వాడిని కదా అని మోహన్ బాబు వారిని కించపర్చే విధంగా మాట్లాడి వారిని మరింత రెచ్చగొట్టారని అంటున్నారు.

బుధవారం రాత్రి కూడా వారిపై సెక్యూరిటీ చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు మాట్లాడుతూ తాము భయపడేది లేదని హెచ్చరించారు. అయితే సినిమాలో బ్రాహ్మణ వర్గాన్ని కించపర్చలేదని చెప్పారు. అయితే దీని వెనుక ఎవరి హస్తమో ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కొసమెరుపు ఏమంటే ఇంతకుముందు కలెక్షన్ల కోసం వివాదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ వివాదాల కారణంగా నిర్మాతలు, బయ్యర్లు ఎంతోకొంతమేర నష్టపోతున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని వివాదం చుట్టుముట్టడంతో తాను కొంత నష్టపోయానని దిల్ రాజు సినిమా సన్నివేశాలను తొలగించి తిరిగి థియేటర్లకు పంపించే సమనయంలో చెప్పారు.

English summary
Tollywood pictures are dipping in controversy like Cameraman Ganga Tho Rambabu and Denikaina Ready.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X