• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్(పిక్చర్స్)

By Srinivas
|

భారతీయ నేపథ్యంలో వచ్చిన లైఫ్ ఆఫ్ పై చిత్రానికి ఆస్కార్‌లో అవార్డుల పంట పండింది. ప్రముఖ దర్శకుడు ఆంగ్ లీ భారతీయ ఆత్మకు ప్రాణం పోసి, దానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించారు. ఈ చిత్రానికి నాలుగు ఆస్కార్‌లు వచ్చాయి. లైఫ్ ఆఫ్ పై చిత్రం ఉత్తమ దర్శకుడు(ఆంగ్ లీ), ఉత్తమ సంగీతం(మైఖేల్ డన్నా), ఉత్తమ ఛాయాగ్రహనం(క్లౌడియా మిరండా), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్(బిల్ వెస్టేన్ హోఫర్, గ్యుల్లామె రోచెరాన్, ఎరిక్ జాన్ డె బోయెర్, డొనాల్డ్ ఆర్.ఎల్లియేట్) విభాగాల్లో ఆస్కార్‌లను దక్కించుకుంది.

లైఫ్ ఆఫ్ పై చిత్రానికే ఉత్తమ ఒరిజినల్ సాహిత్యం విభాగంలో బాంబే జయశ్రీ పోటీ పటింది. పురస్కారం దక్కలేదు. అయితే భారతీయత ఆత్మగా వచ్చిన ఈ చిత్రానికి నాలుగు ఆస్కార్‌లు లభించడం మాత్రం గమనార్హం. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సూరజ్ శర్మతో పాటు కీలక పాత్రల్లో భారతీయ నటులు ఇర్ఫాన్ ఖాన్, టబులు కనిపించారు. సినిమాను ఎక్కువ భాగం కూడా భారత్‌లోనే చిత్రీకరించారు.

ప్రచారంలో భాగంగా దర్శకుడు ఆంగ్ లీ మన దేశానికి వచ్చారు. దర్శకుడు ఆంగ్ లీ అవార్డు తీసుకుంటున్న సమయంలో సూరజ్... సూరజ్ ఎక్కడున్నావ్? నీవొక అద్భుతానివి. కృతజ్ఞతలు. జీ... జీ.. నమస్తే అంటూ వేదిక మీది నుండి మాట్లాడారు. అద్భుతమైన పుస్తకం రాసి తనకు స్ఫూర్తినిచ్చిన యాన్ మార్టెల్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆంగ్ లీ.. అచ్చమైన భారతీయుడిలా నమస్తే చెప్పి తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. అస్కార్ వేదిక పైన భారతీయ నటుడు సూరజ్‌కు అరుదైన గౌరవం దక్కడం విశేషం.

యూనిట్ మొత్తానికి గౌరవం

తాను నటించిన చిత్ర దర్శకుడికి ఆస్కార్ అవార్డు లభించడంపై 'లైఫ్ ఆఫ్ పై'లో చిన్న పాత్ర ధరించిన భారతీయుడు ఆదిల్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. తనది ఇందులో చిన్న పాత్రే అయినా తమ యూనిట్ మొత్తానికి ఈ గౌరవం లభించినట్లు భావిస్తున్నామని, ఆంగ్ లీ ఒక వ్యక్తిగాను, దర్శకుడిగాను అద్భుతమైనవారని అన్నారు.

మిచెల్లీ డిజైనర్ భారతీయుడు!

ముంబైలో పుట్టి అమెరికాలో స్థిరపడిన సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ నయీంఖాన్. ఈయన రూపొందించిన దుస్తులతో అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో ఒబామా దంపతులు తొలిసారి ఇచ్చిన అధికారిక విందులో కూడా నయీం రూపొందించిన ప్రత్యేక గౌనునే మిషెల్లీ ధరించారు. ఈసారి తళతళలాడే గౌను ధరించిన మిచెల్లీ శ్వేతసౌధంలోని దౌత్య మందిరం నుంచే ఈ వేడుకలలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆమె ఉత్తమ చిత్రంగా ఆర్గో‌ను ప్రకటించారు. నయీంఖాన్ గతంలో బెయాన్స్, కేరీ అండర్‌వుడ్, ఎవా లాంగారియా, బ్రూక్ షీల్డ్స్ లాంటి చాలామంది ప్రముఖులకు దుస్తులు డిజైన్ చేశారు.

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

ఆస్కార్ వేదిక పైనుండి దర్శకుడు ఆంగ్ లీ 'నమస్తే'

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

అమెరికన్ భారతీయుడు రూపొందించిన డిజైన్ దుస్తులతో మిచెల్లీ ఒబామా

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

నాలుగు ఆస్కార్‌లు దక్కించుకున్న 'భారతీయ ఆత్మ' లైఫ్ ఆఫ్ పై

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

స్కైఫాల్ చిత్రానికి ఆడిల్ ఆడ్కిన్స్, పాల్ ఎప్‌వర్త్‌లకు ఉత్తమ పాట విభాగంలో అవార్డు వచ్చింది. ఇదే విభాగంలో పోటీ పడిన భారతీయ గాయని బాంబే జయశ్రీ అవార్డు పొందలేకపోయారు.

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

ఉత్తమ కథానాయకుడు డానియెల్ డే లెవిస్(లింకన్)

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

ఉత్తమ నటి జెన్నీఫర్ లారెన్స్(సిల్వర్ లైనింగ్ ప్లేబుక్)

ఆస్కార్‌లో భారతీయానికి నమస్తే: జయశ్రీ జస్ట్ మిస్

పురస్కార స్వీకరణ కోసం వేదిక పైకి ఎక్కే క్రమంలో తూలిపడ్డ జెన్నీఫర్

English summary
It was a big moment for Ang Lee when he won the best Director Oscar for Life of Pi at the 85th Academy Awards, but it was a bigger moment for his Indian fans when he ended his acceptance speech with Namaste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X