హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కుమ్మెర కాశ్మీరాన్ని తలపించింది. మంగళవారం రాత్రి కురిసిన మంచుతో ఆ ప్రదేశమంతా కప్పుకుపోయింది. బుధవారం ఉదయం వరకు కూడా అది కరగలేదు. అంతా మంచు కురవడంతో చాలామంది ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల నుండి చూసేందుకు తరలి వచ్చారు. కుమ్మెరలో కురిసిన మంచును ఆసక్తిగా, ఆనందంగా తిలకించారు. కనుచూపుమేర మొత్తం హిమపాతం కనిపించింది.

ప్రకృతి అందాన్ని తిలకించేందుకు చేవెళ్ల మండలంతో పాటు శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల ప్రజలు బారులు తీరారు. బుధవారం ఉదయం ఆయా పాఠశాలల విద్యార్థులు మంచుతో ఏర్పడిన అందాన్ని కనువిందు చేశారు. యువకులు ఐస్ గడ్డల మధ్య ఎంజాయ్ చేశారు. కొంతమంది యువకులు మంచు తెరలపై బైక్‌లు తిప్పారు. వడగళ్ల వానకు గ్రామంలో ఇళ్ల మధ్య మంచు గడ్డలు అట్టలు కట్టాయి. ప్రతి ఇంటి మందు మహిళలు పారలతో కొట్టి గంపలతో పారబోశారు.

పొలాలన్నీ మంచుతో కమ్ముకోవటంతో పంటలు పాడయ్యాయి. దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. సరఫరాలో అంతరాయం కలిగింది. వడగళ్ల వర్షం రైతలకు కడగళ్లను మిగిల్చింది. దాదాపు 1154 ఎకరాల్లో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అగ్రికల్చర్‌కు సంబంధించి 343 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం పాడయ్యాయి.

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

అందాల కాశ్మీరాన్ని తలపించేలా కప్పుకున్న మంచుదుప్పటి

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

వాకిళ్ల ముందే హిమపాతం...

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

మంచుదుప్పటిలో యువత హంగామా

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

చిన్నారుల చిందులు

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

కుప్పలుగా ఇలా...

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

రహదారిపై మంచుదుప్పటి

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

దారి నిండా మంచు గడ్డలే

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

గ్రామంలో, పరిసరాల్లో అంతా ఇలాగే

మంచుకురిసినవేళలో: చేవెళ్ల అందం వావ్..(పిక్చర్స్)

హిమపాతంలో రయ్ రయ్..., హలో హలో...

English summary

 The freaky weather threw up a surprise in Chevella mandal in the neighbouring Ranga Reddy district on Tuesday night. Seven villages in the mandal experienced an unusual phenomenon__they were enveloped in a thick blanket of 'snow'. Though revenue and police officers confirmed about the freaky occurrence, meteorological officials dismissed it saying "we have not heard about it".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X