వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రావిడ్ బ్యాడ్ లక్: గంగూలీ మాటేమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sourav Ganguly and Rahul Dravid
కోల్‌కతా: క్రికెట్ క్రీడాప్రపంచంలో జెంటిల్మన్‌గా పేరు గాంచిన రాహుల్ ద్రావిడ్ నిజంగా దురృష్టవంతుడనే చెప్పాలి. అతను ఎంత సౌమ్యంగా, మర్యాదగా ఉంటాడో అందరికీ తెలుసు. కానీ, సమస్యలు అతన్నే చుట్టుముడుతున్నాయి. రాహుల్ ద్రావిడ్‌ను చూస్తుంటే బాధేస్తుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు.

ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో గతంలో గ్రెగ్ చాపెల్ వల్ల ఇబ్బంది పడితే, ఇప్పుడు శ్రీశాంత్ వల్ల సమస్య ఎదుర్కున్నాడని గంగూలీ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత చవాన్, అజిత్ చండిల అరెస్టయిన మర్నాడు గంగూలీ ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడాడు.

రాహుల్ చూస్తే బాధేస్తోందని, ఇది అతని దురదృష్టమని ఆయన అన్నారు. రాహుల్ ద్రావిడ్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎక్కువ కాలం గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు చాపెల్ వల్ల అతను ఇబ్బందులు పడ్డాడని, ఇప్పుడు శ్రీశాంత్ కారణంగా ఐపియల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా ద్రావిడ్‌ను దురదృష్టం వెంటాడిందని గంగూలీ అన్నాడు.

కాగా, రాహుల్ ద్రావిడ్‌పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఐపియల్ ఆరో ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడని చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అంత గొప్పదేమీ కాదని, కెప్టెన్‌గా ద్రావిడ్ అద్భుతాలు చేశాడని, ద్రావిడ్ టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా ఇంత బాగా వ్యవహరించిన సందర్భాలను తాను చూడలేదని గంగూలీి అన్నాడు.

English summary
ormer India captain Sourav Ganguly on Friday said he felt bad for Rajasthan Royals skipper Rahul Dravid who had to "contend with people like Greg Chappell and S. Sreesanth" during his captaincy stints for the country and the IPL franchisee respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X