వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్ గురు: పార్లమెంటుపై దాడి నుంచి ఉరి దాకా

By Pratap
|
Google Oneindia TeluguNews

Afzal Guru
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగిన 11 ఏళ్లకు దానికి సూత్రధారి అయిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష పడింది. 2001 డిసెంబర్ 13వ తేదీన ఉగ్రవాదులు పార్లమెంటు భవనంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ పార్లమెంటు భద్రతా సిబ్బందే కావడం గమనార్ఙహం. ఆ దాడి కేసులో అఫ్జల్ గురును పోలీసులు పట్టుకున్నారు.

పార్లమెంటు దాడికి కుట్ర చేసినందుకు 2002 డిసెంబర్ 18వ తేదీన ఢిల్లీ కోర్టు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు 2003 అక్టోబర్ 29వ తేదీన సమర్థించింది. 2005 ఆగస్టు 4వ తేదీన అఫ్జల్ గురు అపీల్‌ను తిరస్కరించింది.

2006 అక్టోబర్ 20వ తేదీన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండింది. అయితే, అతని భార్య రాష్టపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో అది ఆగిపోయింది. ముంబై ఉగ్రవాదుల దాడి తర్వాత అఫ్జల్ గురును ఉరి తీయాలనే డిమాండ్ ‌తీవ్రత పెరిగింది.

2011 ఆగస్టులో హోం మంత్రిత్వ శాఖకు మెర్సీ పిటిషన్ సిఫార్సును పంపించారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగిసిన తర్వాత అఫ్జల్ గురు ఫైల్‌ను పరిశీలిస్తానని 2012 డిసెంబర్ 10వ తేదీన హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 22వ తేదీన ముగిశాయి.

అఫ్జల్ గురును ఉరి తీయాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2013 జనవరి 23వ తేదీన ఫైల్ చేరింది. ఆ సిఫార్సును ఆమోదిస్తూ రాష్ట్రపతి 2013 జనవరి 26వ తేదీన సంతకం చేశారు.

English summary
Afzal was awarded death sentence by a Delhi court after being convicted of conspiracy to attack Parliament on December 13, 2001.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X