హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ పేలుళ్లు: కేసు బదలీకి ఒకే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Hyderbad Bomb Blasts to NIA
వారం రోజుల క్రితం హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయమై ఈ రోజు దీనిపై సమీక్ష జరుపనున్నారు. రాష్ట్ర సర్కారు కూడా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించేందుకే మొగ్గు చూపుతోంది. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని బుధవారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు హోంమంత్రి, డిజిపి తదితరులతో కిరణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కేసును ఎన్ఐఏకి అప్పగించాలని ఆదేశాలిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక బాంబులు పేలిన కొన్ని గంటల్లోనే ఎన్ఐఏ బృందాలు హైదరాబాద్ చేరుకుని ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ కేసును తమకు అప్పగించాలని కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలోనే అధికారులు కోరారు.

అయితే, హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ గురించి తెలుసు గనుక తామే ఛేదిస్తామని రాష్ట్ర పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా ముఖ్యమంత్రిని కూడా ఒప్పించడంతో కేసు బదిలీ ఆగిపోయింది. తాజాగా కేంద్ర హోంశాఖ దీనిని ఎన్ఐఏకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయడంతో కేసును బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు బీహార్, బెంగళూరు, కాశ్మీర్‌ల నుంచి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. కేసు మూలాలు పలు రాష్ట్రాల్లో ఉన్నందున తామైతే త్వరగా ఛేదించగలమని కేంద్ర హోంశాఖకు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కేసును అప్పగించేస్తేనే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. కేంద్ర నిఘా సంస్థలు మూడుసార్లు హెచ్చరించినా నిర్లక్ష్యం వహించడంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విచారణ పూర్తయింది.

English summary
NIA has conducted raids in Aurangabad, Beed and Nanded in connection with Hyderabad bomb blasts already.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X